'కొండవీటి దొంగ' తెర వెనుక కథ - Nostalgia

By iDream Post Mar. 25, 2020, 09:02 pm IST
'కొండవీటి దొంగ' తెర వెనుక కథ  - Nostalgia

రాబిన్ హుడ్ స్టైల్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన కొండవీటి దొంగ అప్పట్లో సూపర్ హిట్ మూవీ. ఒళ్లంతా నల్ల బట్టలు వేసుకుని, ముఖానికి ముసుగు, తిరగడానికి గుర్రం, వెనుకగా వచ్చే కుక్క ఇలా ఈ సెటప్ అప్పట్లో చాలా కొత్తగా అనిపించింది. ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీలయ్యారు. 1990లో వచ్చిన ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్. అయితే దీని వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటో చూద్దాం. ముందు కొండవీటి దొంగకు అనుకున్న హీరొయిన్ శ్రీదేవి. 1987లోనే త్రివిక్రమరావు గారు పరుచూరి బ్రదర్స్ తో ఈ కథ రెడీ చేయించారు. శ్రీదేవి కూడా ఎస్ చెప్పింది.

అంతకు ముందు ఏడాదే చిరు-శ్రీదేవి కాంబోలో వజ్రాల దొంగ అనే మూవీ ఓ పాట షూట్ చేశాక ఆగిపోయింది. ఇది అలా జరగదనే అనుకున్నారు. కానీ ఎందుకో వేర్వేరు కారణాల వల్ల శ్రీదేవి కొండవీటి దొంగ కూడా వదులుకోవాల్సి వచ్చింది. బహుశా దొంగ అనే పేరు కలిసి రాలేదేమో. సరే అలా రెండేళ్లు గడిచాక ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే టైం వచ్చింది. కానీ పరుచూరి వారు కథ రాసేటప్పటికీ ఒకరే హీరోయిన్. కానీ త్రివిక్రమరావు గారు కొన్ని కీలకమైన మార్పులు కోరడంతో స్టోరీ కాస్త మారిపోయి విజయశాంతితో పాటు రాధ కూడా వచ్చి చేరింది.

మరోవైపు ఎంతకీ కుదరని చిరంజీవి-శ్రీదేవి కాంబినేషన్ ని తన జగదేకవీరుడు అతిలోకసుందరి కోసం సెట్ చేశారు అశ్విని దత్. కొండవీటి దొంగ రిలీజై మొదట్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఫైనల్ గా సూపర్ హిట్ కొట్టి వంద రోజులు పూర్తి చేసుకుంది . చిరంజీవికి రాక్షసుడు మొదటి 'సినిమా స్కోప్' కాగా కొండవీటి దొంగ ఫస్ట్ 70ఎంఎం మూవీ. అలా కొండవీటి దొంగతో హీరొయిన్లే కాదు ఏకంగా కథే మారడం విశేషం కదా. అన్నట్టు కథ మారే క్రమంలో యండమూరి వీరేంద్రనాథ్ కూడా చేతులు కలపడం విశేషం. ఎన్ని మార్పులు జరిగినా అందరూ కోరుకున్న ఫలితం దక్కడంతో ఆ ఏడాది టాప్ హిట్స్ లో కొండవీటి దొంగ నిలిచిపోయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp