నాన్నకు తమ్ముడు కొడుక్కి అన్నయ్య - Nostalgia

By iDream Post Aug. 02, 2020, 09:39 pm IST
నాన్నకు తమ్ముడు కొడుక్కి అన్నయ్య - Nostalgia

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా వారసత్వాన్ని తీసుకున్నప్పటికీ తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ తో వందల కోట్ల మార్కెట్ ను సృష్టించుకున్న మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా చెప్పుకోదగ్గ సినిమాలు చేసిన విషయం గురించి ఇప్పటి యంగ్ జెనరేషన్ కు అవగాహన తక్కువే. 1983లో 'పోరాటం' ద్వారా పరిచయమైన మహేష్ ఆ తర్వాత నాన్న కృష్ణ దర్శకత్వంలో మంచి హిట్స్ సాధించాడు. వాటిలో మూడు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకటి డెబ్యు చేసిన పోరాటం. రెండు 1988లో వచ్చిన 'ముగ్గురు కొడుకులు'. మూడోది 1990లో వచ్చిన 'అన్న తమ్ముడు'. వీటిలో విశేషం ఏమిటంటే కృష్ణకు తమ్ముడిగా మహేష్ బాబు నటించడం. ఈ మూడూ మంచి సెంటిమెంట్ డ్రామాతో కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలు కావడం.

ముగ్గురు కొడుకులులో రమేష్ బాబు కూడా ఉంటాడు. అప్పట్లో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది వసూళ్లు కూడా బాగా తెచ్చుకుంది. అన్న తమ్ముడు దర్శకులు కూడా కృష్ణనే. అయితే ఇది ముందు సినిమా అంత గొప్ప సక్సెస్ కాలేదు. మధ్యలో 'కొడుకు దిద్దిన కాపురం'లో కృష్ణ-మహేష్ తండ్రికొడుకులుగా నటించగా 'గూఢచారి 117'లో వేరే పాత్రలు పోషించారు. ఇవి కూడా హిట్ కొట్టాయి. ఒకరకంగా చెప్పాలంటే మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి దూకుడు మీద ఉండేవాడు. ఆ టైంలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే చదువుకు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో బాలచంద్రుడు సినిమా తర్వాత తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నాడు.

అది పూర్తయ్యాక రాజకుమారుడుతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి అటుపై తిరుగులేని ప్రస్థానంతో 26 సినిమాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్నాడు. యుట్యూబ్లో, ఛానల్స్ లో మహేష్ అప్పటి సినిమాలు చూసినప్పుడల్లా అప్పట్లో ఎంత బొద్దుగా ఉన్నాడో అనిపించడం ఖాయం. డ్యాన్సులు కూడా ఆ వయసులోనే ఆలా చేయడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేవారు. ఒమెగాస్టార్ అనే బిరుదు కూడా ప్రచారంలో ఉండేది. పబ్లిసిటీ పోస్టర్స్ లో ఆ ట్యాగ్ ని వాడేవారు. ఆ తర్వాత కృష్ణ గారు సినిమాలు తగ్గించుకున్నాక క్రమంగా అది మహేష్ కు సార్థక నామధ్యేయం అయ్యింది. హీరో అయ్యాక మహేష్ బాబు కృష్ణ గారితో కలిసి రాజకుమారుడు-వంశీ చేశారు. అందులో ఒకటే బ్లాక్ బస్టర్ కాగా రెండోది డిజాస్టర్ గా నిలిచింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp