కరోనా హోరులో 'జాంబీ'లతో యుద్ధం

By iDream Post Dec. 05, 2020, 12:45 pm IST
కరోనా హోరులో 'జాంబీ'లతో యుద్ధం

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు కానీ ఈ కాన్సెప్ట్ మీద హాలీవుడ్ కన్నా ముందుగా తెలుగులోనే సినిమాలు రెడీ అవుతున్నాయి. అందులో మొదటిది జాంబీ రెడ్డి. అ!తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ని ఇందాకా విడుదల చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో భాగం పంచుకుని ఇటీవలే ఓ బేబీతో సపోర్టింగ్ రోల్ లో పరిచయమైన తేజ సజ్జ సోలో హీరోగా నటిస్తున్న మొదటి మూవీ ఇది. టైటిల్ ప్రకటించినప్పుడు కొంత వివాదం చెలరేగినా ఆ తర్వాత అదేమంత పెద్ద ఇష్యూ కాలేదు. ఇక టీజర్ విషయమేంటో చూద్దాం.

జాంబీ రెడ్డిని మొదటి టాలీవుడ్ జాంబీ మూవీగా పేర్కొన్నారు. ఇలాంటివి దశాబ్దాల క్రితమే ఇంగ్లీష్ లో వచ్చాయి కానీ ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి అది సెట్ కాదని ఇప్పటిదాకా ఎవరూ పెద్దగా ట్రై చేయలేదు. ప్రశాంత్ వర్మ మొత్తానికి సాహసమే చేశాడు. కరోనా వ్యాక్సిన్ కనుగునే క్రమంలో జరిగిన పరిణామాలు, ఒక వైరస్ మనుషులను జాంబీలుగా మారిస్తే ఆ తర్వాత ఏర్పడే ప్రమాదకరమైన పరిస్థితులను కాన్సెప్ట్ గా తీసుకుని దీన్ని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. తేజ సజ్జ ఒక ఫ్రేమ్ లో మాత్రమే కనిపించినప్పటికీ లుక్స్ పరంగా ఆకట్టుకునేలా ఉన్నాడు. గేమ్ ఆన్ అనే టాటూని చేతి మీద చూపించడం ద్వారా చిన్నపాటి హింట్ ఇచ్చారు.

ఇందులో హీరోయిన్లుగా ఆనందిని, దక్ష నటిస్తుండగా ఇతర తారాగణం చాలానే ఉంది. కథానాయికలను తప్ప క్యాస్టింగ్ ని రివీల్ చేయలేదు. రఘుబాబు, పృథ్విరాజ్, గెటప్ శీను, హర్షవర్ధన్, హేమంత్, కిరీటి, హరితేజ, అదుర్స్ రఘు, మహేష్ విట్టా, అన్నపూర్ణమ్మ, విజయరంగరాజు తదితరులు నటించారు. అనిత్ ఛాయాగ్రహణం అందించగా మార్క్ కె రాబిన్ సంగీతం సమకూర్చారు. ఈ రెండు విభాగాలు మంచి స్టాండర్డ్ ఇచ్చినట్టు టీజర్ లో స్పష్టమయ్యింది. కల్కి ఫలితం నిరాశపరిచినప్పటికీ ప్రశాంత్ వర్మ తనదైన శైలిలోనే థ్రిల్లర్ జానర్ లో జాంబీ రెడ్డి రూపొందించినట్టు కనిపిస్తోంది. విడుదల తేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp