6 ఏళ్ళ తర్వాత ఎవడు కాంబో ?

By iDream Post Jul. 11, 2020, 06:26 pm IST
6 ఏళ్ళ తర్వాత ఎవడు కాంబో ?

గత ఏడాది మహర్షితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వంశీ పైడిపల్లి తర్వాత ఏ సినిమా చేస్తాడనే దాని గురించి ఇప్పటిదాకా క్లారిటీ లేకపోయింది. మరో సినిమా చేస్తానని స్వయంగా మహేష్ బాబే చెప్పడం, దానికి తగ్గ కథను వంశీ సిద్ధం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి .కానీ ఆ తర్వాత ఏవో కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేకపోయింది. సబ్జెక్టు మీద ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే అనేది ఇన్ సైడ్ టాక్. ఏదైతేనేం మొత్తానికి సీన్ లోకి పరశురాం ఎంటరైపోయి సర్కారు వారి పాటను తన ఖాతాలో వేసుకున్నాడు. లాక్ డౌన్ వల్ల రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. ఇదిలా ఉండగా వంశీ పైడిపల్లికి మరో సారి మెగా ఛాన్స్ వచ్చినట్టు వినికిడి.

ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమాకు ఇతనే కెప్టెనని సమాచారం. అధికారికంగా ధృవీకరించనప్పటికీ ప్రాధమికంగా డిస్కస్ చేసుకున్న లైన్ మీద గ్రీన్ సిగ్నల్ దొరికినట్టు తెలిసింది. ప్రకటించడానికి మాత్రం టైం పట్టేలా ఉంది. ఈ కాంబోలో గతంలో ఎవడు వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో 2014లో వచ్చిన ఎవడు కమర్షియల్ గా భారీ హిట్ అందుకుంది. యాక్షన్ రివెంజ్ డ్రామాగా వంశీ పైడిపల్లి దాన్ని తీర్చిదిద్దిన తీరు ఘనమైన వసూళ్లు వచ్చాయి. అల్లు అర్జున్ క్యామియో, మంచి మలుపులతో సాగే కథనం మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. తర్వాత మరో సినిమా చేయాలనుకున్నారు కానీ ఎందుకనో కుదరలేదు. ఇప్పటికీ సెట్ అవుతున్నట్టు కనిపిస్తోంది.

నిజానికి లాక్ డౌన్ టైంలో చరణ్ నెక్స్ట్ ఏ సినిమా చేయాలనే దాని మీద చాలా తీవ్రంగా ఆలోచించినట్టు టాక్ వచ్చింది. పలువురు దర్శకులు కథలు చెప్పినా అంత సులువుగా కన్విన్స్ కాలేదట. అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి చెప్పింది మహేష్ నో అన్న స్టోరీనా లేక ఏదైనా ఫ్రెష్ గా రాసుకున్నాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్, ఆచార్య కమిట్మెంట్స్ పూర్తి చేయడానికి ఎంత లేదన్న వచ్చే ఏడాది వేసవి దాకా అయ్యేలా ఉంది. ఆలోగా వంశీ పైడిపల్లికి ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసేందుకు కావాల్సినంత టైం దొరుకుతుంది. మొత్తానికి ఇది అభిమానులకు గుడ్ న్యూసే కాని అఫీషియల్ నోట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. షూటింగులు తిరిగి మొదలుపెట్టాక రామ్ చరణ్ వెంటనే ఆర్ఆర్ఆర్ లో జాయిన్ కావాల్సి ఉంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp