ఫ్లాప్ కి రీమేకా - కారణం ఇదేనా

By iDream Post Mar. 18, 2020, 12:43 pm IST
ఫ్లాప్ కి రీమేకా - కారణం ఇదేనా

ఈ ఏడాది అత్యంత దారుణమైన డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ని హిందిలో కరణ్ జోహార్ రీమేక్ చేయబోతున్నాడన్న వార్త షాక్ కలిగిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాని హక్కులు కొన్నట్టు మాత్రం టాక్ బలంగా వినిపిస్తోంది. దీని వెనుక పలు ఆసక్తికరమైన సంగతులు తెలుస్తున్నాయి. విజయ్ టేస్ట్ మీద ఎందుకో గాని కరణ్ జోహార్ కు ముందు నుంచి చాలా గురి. గతంలో డియర్ కామ్రేడ్ రిలీజ్ కు ముందే చూసి ఇదో అద్భుత కళాఖండమని, గొప్ప సినిమా అవుతుందని సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టి మరీ హల్చల్ చేశాడు.

అంతేకాదు బాలీవుడ్ లో దీన్ని తనే తీస్తానని కూడా ప్రకటించాడు. కట్ చేస్తే బొమ్మ బోల్తా కొట్టింది. కరణ్ గప్ చుప్ అయిపోయాడు. వరల్డ్ ఫేమస్ లవర్ టైంలో మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. దాని ఫలితం ఇంకా ఘోరంగా వచ్చింది. అయితే నార్త్ ప్రేక్షకుల టేస్ట్ కు అనుగుణంగా ఉందని ఇప్పుడీ మూవీని తెరకెక్కించబోతున్నాడని ముంబై మీడియా టాక్. ఇక్కడ ఇంకో కోణం ఉంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న లైగర్/ఫైటర్(ప్రచారంలో ఉన్న టైటిల్స్) లో కరణ్ జోహార్ కు నిర్మాణ భాగస్వామ్యం ఉంది. హింది వెర్షన్ ను తనే స్వంతంగా రిలీజ్ చేయబోతున్నాడు.

ఆ మాటకొస్తే ఇది హిందిలోనే తీస్తున్నారని తెలుగులో నోటా టైపులో డబ్బింగ్ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. దీని సంగతలా ఉంచితే విజయ్ దేవరకొండ స్పెషల్ రిక్వెస్ట్ మీదే కరణ్ వరల్డ్ ఫేమస్ లవర్ ని చూశాడట. ఇంత ఫీల్ గుడ్ త్రీ ఇన్ వన్ లవ్ స్టొరీ హిందిలో అయితే బాగా రిసీవ్ చేసుకుంటారని విజయ్ చెప్పడంతో కరణ్ సైతం ఎస్ చెప్పినట్టు వినికిడి. ఇది కార్యరూపం దాల్చే దాకా నమ్మలేం కాని మొత్తానికి పాన్ ఇండియా మీద రెండేళ్ళుగా కన్నేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కరణ్ జోహార్ సహాయంతో గట్టి స్కెచ్చె వేశాడు. అన్నట్టు వరల్డ్ ఫేమస్ లవర్ ఒకవేళ హిందిలో రీమేక్ అయితే హీరో ఎవరనేది మాత్రం ఇంకా బయట పడలేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp