టాక్ షోల ట్రెండ్ వర్కౌట్ అయ్యేనా

By iDream Post May. 08, 2021, 03:00 pm IST
టాక్ షోల ట్రెండ్ వర్కౌట్ అయ్యేనా
గత ఏడాది ఊహించని విధంగా అందివచ్చిన లాక్ డౌన్ అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకున్న ఓటిటి సంస్థలు ఇప్పుడు దీన్నో స్థిరమైన అవకాశంగా మార్చుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆహా లాంటి దేశీయ యాప్స్ సైతం పెట్టుబడులు పెంచేసి కొత్త సినిమా హక్కుల కోసం కుమ్మరించడం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటివి సరేసరి. జీ ఫైవ్ కూడా ఏకంగా రెండు వందల కోట్ల పందెం కట్టి రాధేని భారీ ఎత్తున తన ఓటిటిలో రిలీజ్ చేయబోతోంది. హాట్ స్టార్, సోనీ లివ్ లాంటివి ఈ మధ్య కాలంలో వేగం పెంచేసి వెబ్ సిరీస్ ల మీద కూడా స్పెషల్ గా ఫోకస్ పెడుతున్నాయి.

తాజాగా హీరోయిన్ ఇలియానాతో ప్రైమ్ ఒక సెలబ్రిటీ టాక్ షోని ప్లాన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఓటిటిలో వీటికి ఆదరణ కష్టం. గతంలో సమంతా ఇలాంటి షో ఒకటి చేసి చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్లను తీసుకొచ్చినా లాభం లేకపోయింది. దెబ్బకు దాన్ని అర్ధాంతరంగా ఆపేశారు. ఇటీవలే స్టార్ట్ అయిన రానా నెంబర్ వన్ యారీ సైతం సినిమా ప్రమోషన్ ప్రోగ్రాంలా ఉంది తప్పించి ఎలాంటి ప్రత్యేకత లేదని ఓపెన్ గానే సోషల్ మీడియా కామెంట్స్ బయటికి వస్తున్నాయి. ఏదో యుట్యూబ్ లో అంటే ఓకే కానీ ఇలా డిజిటల్ కంటెంట్ లోనూ ఇంటర్వ్యూలు ఇస్తే వచ్చే ఇబ్బంది ఇదే

అయితే ప్రైమ్ చాలా పక్కా ప్రణాళికతో రెగ్యులర్ టాక్ షోలా కాకుండా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తోందట. ఫార్మాట్ లాంటి వివరాలు తెలియలేదు కానీ గతంలో రాని స్టైల్ లో రూపొందించినట్టు ఇన్ సైడ్ టాక్. రెమ్యునరేషన్ కూడా భారీగా ఆఫర్ చేశారట. వచ్చే సెలబ్రిటీలతో వినూత్న టాస్కులు చేయించడం, వాళ్ళు ఎన్నడూ షేర్ చేయని విషయాలను బయట పెట్టుకునేలా చేయడం ఇందులో ప్రత్యేకతగా ఉంటాయని తెలిసింది. అయితే మరి ప్రైమ్ ఈ విషయంలో ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది షో స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యాకే తెలుస్తుంది. ఇందులో కూడా తనదైన ముద్ర ఏదైనా వేస్తుందేమో వేచి చూడాలి
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp