"అల"లో ఫైటింగ్ పాట రాసింది ఎవరో తెలుసా?

By Satya Cine Jan. 16, 2020, 12:48 am IST
"అల"లో ఫైటింగ్ పాట రాసింది ఎవరో తెలుసా?

"సిత్తరాల సిలపడు..." అంటూ సాగే ఒక పాట "అల వైకుంఠపురం" ఆడియో జూక్ బాక్సులో కనపడదు. కానీ సినిమాలో కనిపిస్తుంది. అది కూడా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్సులో వస్తుంది ఆ పాట.

మొదట ఈ పాట వివరాల కోసం అల వైకుంఠపురం వికి పేజిలో వెతికారు చాలామంది. అందులో లేదు. ఇది ఏదైనా పాత ఫోక్ సాంగ్ ఏమోనని యూట్యూబులో వెతికారు. అక్కడా లేదు. మరి ఇది ఎక్కడిదని వాకబు చేస్తే ఒక జానపద రచయిత చేత రాయించారని తెలిసింది.

ఉత్తరాంధ్రకి చెందిన బళ్ళ విజయభాస్కర్ ఒక లెక్చరెర్. ఆయనకి ఉత్తరాంధ్ర యాస మీద పట్టు ఉండడంతొ ఆయనచేత ఈ పాట రాయించారట. ఫైటింగ్ కి కూడా పాట పెట్టొచ్చు అనే వినూత్నమైన ఆలోచన థియేటర్లో బాగా పండింది. "అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు", "గొప్పోడి ఆంబోతు..", "జడల మర్రి దెయ్యం.." ఇలాంటి గ్రామీణ పదాలతో ఫోక్ స్టైల్లో రికార్డ్ చేసిన ఆ పాటని సముద్రఖని పాడుతున్నట్టుగా చూపించారు. పాటలోని పదాలకు తగ్గట్టుగా ఫైటర్స్ కనిపించడం, హీరోయిజం ఎలివేట్ అయ్యేవిధంగా వీరోచితమైన పదాలు ఉండడంతో ఈ పాట గురించి ఎంక్వైరీలు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియాలో కూడా. ఇంతకీ ఈ పాట రాసిన రచయిత వివరాలతోపాటూ యూట్యూబులో దీనిని రిలీజ్ చేసే ఆలోచనతో ఉన్నారట త్రివిక్రం అండ్ కో.

ఏది ఏమైనా ఏదో విధంగా తన సినిమాలకి ఫోక్ టచ్ ఇవ్వడం త్రివిక్రం కి అలవాటుగా మారింది. అరవిందసమేతలో "పెనివిటి" పాట అలాంటిదే. అజ్ఞాతవాసిలో "కొడకా కోటేశ్వరరావు.." కూడా ఫోక్ టచ్ ఉన్న పాటే. మళ్లీ ఇప్పుడు ఈ "సిత్తరాల సిలపడు" అనే పాట. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp