సీరియస్ చర్చలో రానా సినిమా ?

By iDream Post May. 13, 2021, 02:13 pm IST
సీరియస్ చర్చలో రానా సినిమా ?

కరోనా రెండో దశ వల్ల ఏం జరుగుతోందో అంతు చిక్కని అయోమయంలో చాలా సినిమాలు థియేటర్ దాకా వేచి చూడాలా లేక ఓటిటికి వెళ్లాలా అనే సందిగ్ధంలో ఉన్నాయి. కొన్ని డీల్స్ ఆల్రెడీ మొదలుకాగా మరికొన్ని మాత్రం సీరియస్ గా ఆలోచనలో ఉన్నాయి. థియేటర్లు దగ్గర్లో తెరిచే సూచనలు లేకపోవడం నిర్మాతలను టెన్షన్ పెడుతోంది. అసలు పరిస్థితి ఎప్పుడు సాధారణం అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎక్కువ డిజిటల్ రిలీజుల ప్రకటనలు రావడం ఖాయమే. యువి సంస్థ నిర్మించిన చిన్న బడ్జెట్ మూవీ ఏక్ మినీ కథ మంచి ఫాన్సీ డీల్ ని అమెజాన్ ప్రైమ్ తో సెట్ చేసుకున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది.

ఇక విషయానికి వస్తే రానా సాయి పల్లవి కాంబినేషన్ లో రూపొందిన నక్సలైట్ బేస్డ్ మూవీ విరాట పర్వంని ఓటిటికి ఇస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన నిర్మాత సురేష్ బాబు దగ్గర ఉందట. ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి చూస్తే ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు కాబట్టి లాభం అనిపించే ఆఫర్ అయితే ఇచ్చేలా ప్లాన్ చేసుకున్నారని ఇన్ సైడ్ టాక్. నిజానికి థియేట్రికల్ రిలీజ్ తర్వాత హక్కులను నెట్ ఫ్లిక్స్ తీసుకున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్ డిజిటల్ రూట్ అంటే లెక్క మారుతుంది. సదరు సంస్థ కూడా దానికి తగ్గట్టే భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తుంది.

మరి విరాట పర్వం ఏ రూటు తీసుకుంటుందో వేచి చూడాలి. నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన విరాట పర్వం మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇలాంటి సినిమాలు అన్ని వర్గాలను టార్గెట్ చేయలేవు. అందులోనూ ఇప్పుడు అంతగా ప్రభావం లేని నక్సలిజం కాన్సెప్ట్ తో థియేటర్ లో విడుదల చేయడం అనేది కొంత రిస్క్ గానే అనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వాలు యాభై శాతం సీటింగ్ కు మాత్రమే అనుమతిస్తే ఇంకా ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే నష్టపోకుండా డిజిటల్ దారి పట్టడం కూడా రైటే కానీ అఫీషియల్ గా చెప్పే దాకా ఏది ఖరారుగా చెప్పలేం కాబట్టి వేచి చూద్దాం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp