బిగ్ బాస్ 4 ఎప్పుడు వస్తున్నాడు

By iDream Post Aug. 12, 2020, 02:13 pm IST
బిగ్ బాస్ 4 ఎప్పుడు వస్తున్నాడు

టీవీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 4కి రంగం సిద్ధమవుతోంది. నాలుగో సీజన్ కు నాగార్జునే వ్యాఖ్యాతగా కన్ఫర్మ్ కావడంతో అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రోమో షూట్ జరిగిపోయింది. మరోవైపు హౌస్ తాలూకు సెట్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పుడు కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా కంస్ట్రక్షన్ లో చాలా మార్పులు చేస్తున్నారు. హౌస్ మేట్స్ ఒకరితో ఒకరు ఎక్కువ ముట్టుకోలేని విధంగా టాస్కుల ప్లానింగ్ జరుగుతోంది. అయితే ఇది ఎప్పుడు మొదలవుతుందో అనే దాని గురించి క్లారిటీ లేదు. ఈ నెలాఖరున అనుకుంటున్నారు కానీ సెప్టెంబర్ మొదటి వారంలోనే షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలిసింది.

ప్రస్తుతం ఫైనల్ చేసిన పార్టిసిపెంట్స్ అందరూ హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. నిర్దేశించిన గడువు పూర్తి కాగానే వాళ్లకు కరోనా టెస్ట్ చేయించి రిజల్ట్ నెగటివ్ వచ్చాక ఒకేసారి అందరిని లోపలికి తీసుకెళ్లబోతున్నారు. భవిష్యత్తులో బయట నుంచి ఏదైనా లీగల్ సమస్య వస్తే రిపోర్ట్స్ ఆధారాలుగా ఉండబోతున్నాయి. నాగార్జున మాత్రం కేవలం వీకెండ్ మాత్రమే వస్తారు కాబట్టి అందులోనూ ఎవరితోనూ డైరెక్ట్ ఇంటరాక్షన్ చేయరు కనక ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ;లెక్కన చూస్తే బిగ్ బాస్ 4 సెప్టెంబర్ రెండు లేదా మూడో వారం నుంచి స్టార్ట్ అవ్వొచ్చు. ప్రమోషన్లు అతి త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. ఎవరు పాల్గొంటున్నారు అనే విషయాలు మాత్రం చాలా సీక్రెట్ గా దాస్తున్నారు.

ఓ ప్రముఖ తెలంగాణ గాయని, ఓ కొరియోగ్రాఫర్, మాజీ యాంకర్ ఇలా ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి కానీ అధికారికంగా ప్రకటించే దాకా వేచి చూడక తప్పదు.బిగ్ బాస్ సీజన్ 4కి స్టార్ మా భారీ రేటింగ్ ఆశిస్తోంది. మొదటి మూడు సిరీస్ లు బాగానే వర్కవుట్ అయినప్పటికీ హిందీ, తమిళం స్థాయిలో ఈ షో ఇక్కడ మేజిక్ చేయలేకపోతోంది. ఏదో మిస్ అవుతున్న ఫీడ్ బ్యాక్ ప్రతిసారి వస్తోంది. అందులోనూ యాంకర్లు మారుతూ రావడం కూడా ప్రభావం చూపించింది. అందుకే నాగార్జునని స్టాండర్డ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. రోజులు కుదించి షో నడుపుతారన్న వార్త కూడా నిజం కాదట. పూర్తిగా 100 రోజులు బిగ్ బాస్ 4 ఉంటుందని తాజా అప్డేట్. అన్ని వివరాలు కర్టెన్ రైజర్ ప్రోగ్రాంలో అనౌన్స్ చేయబోతున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp