Allu Arjun : అంతుచిక్కని ఐకాన్ స్టార్ ప్లానింగ్

By iDream Post Nov. 26, 2021, 10:36 am IST
Allu Arjun : అంతుచిక్కని ఐకాన్ స్టార్ ప్లానింగ్

ఊపిరిసలపనంత బిజీగా బ్యాలన్స్ షూటింగ్ ప్లస్ పోస్ట్ ప్రొడక్షన్ ఒకేసారి జరుపుకుంటున్న పుష్ప పార్ట్ 1 మీద ఒత్తిడి మాములుగా లేదు. డిసెంబర్ 17 విడుదల తేదీ మార్చే దారులు దాదాపుగా మూసుకుపోయాయి. 24కి షిఫ్ట్ చేద్దామంటే ఆల్రెడీ శ్యామ్ సింగ రాయ్ లాక్ చేసుకుని ప్రమోషన్లు కూడా ఫుల్ గా చేసుకుంటున్నాడు. ఇక జనవరి అనేది కలలో కూడా ఊహించలేనిది. సో ఎట్టి పరిస్థితుల్లో పుష్ప చెప్పిన టైంకి రావడం తప్ప వేరే ఆప్షన్ లేదు. దర్శకుడు సుకుమార్ పని ఒత్తిడి కారణంగానే స్వల్ప అస్వస్ధతకు గురయ్యారనే టాక్ కూడా వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని త్వరలోనే గ్రాండ్ గా యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా పుష్ప 1 తర్వాత సీక్వెల్ కి కొంత బ్రేక్ ఇస్తామని గతంలోనే మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. మధ్యలో వేణు శ్రీరామ్ తో ఐకాన్ ఉండొచ్చనే ప్రచారం జరిగింది. కానీ దానికి సంబంధించి ఎలాంటి సౌండ్ వినిపించడం లేదు. నిజంగా పట్టాలెక్కుతుందా లేదా అనే క్లారిటీ కూడా లేదు. ఈ నేపథ్యంలో బన్నీ నెక్స్ట్ ఎవరితో అనే సందేహం అందరిలోనూ ఉంది. కారణం స్టార్ డైరెక్టర్లందరూ చాలా బిజీగా ఉన్నారు. ముందు అనుకున్న కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కు సెట్ అయ్యారు. త్రివిక్రమ్ చూస్తే ఇంకా మహేష్ బాబు మూవీనే స్టార్ట్ చేయలేదు. ప్రశాంత్ నీల్ కు సలార్ తర్వాత తారక్, చరణ్ లతో విడివిడిగా కమిట్ మెంట్స్ ఉన్నాయి.

ఇప్పుడు కనిపిస్తున్న ఆప్షన్లు రెండే. మొదటిది బోయపాటి శీను. అఖండ ఫలితం చూశాక తనతో సరైనోడు కాంబినేషన్ రిపీట్ చేయడానికి బన్నీ ఎదురుచూస్తున్నాడనే న్యూస్ అంతకు ముందే బయటికి వచ్చింది. ఒకవేళ రిజల్ట్ ఏమైనా అటుఇటు అయితే నిర్ణయం మార్చుకుంటారా లేదా తెలియదు. రెండోది పరశురామ్. సర్కారు వారి పాట అయ్యాక ఇతను ఇంకా ఎవరికీ ఫిక్స్ అవ్వలేదు. మార్చిలో ఫ్రీ అయ్యాక అప్పుడు ఏమైనా చెప్తారేమో. ఒకవేళ మూడో ఆప్షన్ గా రాధే శ్యామ్ ని డీల్ చేస్తున్న రాధాకృష్ణ అనుకోవచ్చు. అదీ సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ ఏంటనే ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది

Also Read : KGF Chapter 2 : రాఖీ భాయ్ అభిమానులు వెయిట్ చేయాల్సిందే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp