Pushpa : బన్నీ సుకుమార్ ల ప్లాన్ ఏమిటో

By iDream Post Dec. 05, 2021, 06:00 pm IST
Pushpa : బన్నీ సుకుమార్ ల ప్లాన్ ఏమిటో

రేపు పుష్ప పార్ట్ 1 ట్రైలర్ విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ కు ఇంకో పది రోజులు మాత్రమే సమయం ఉండటంతో టీమ్ పగలు రాత్రి తేడా లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ఇంకో వారంలోపే సెన్సార్ చేయించాలి. అఖండ వసూళ్లు చూశాక బన్నీ ఫ్యాన్స్ కు నమ్మకం రెట్టింపయ్యింది. సినిమా ఏ మాత్రం బాగున్నా కలెక్షన్ల ఊచకోత ఖాయమనే క్లారిటీ వచ్చేసింది. ఒమిక్రాన్ వైరస్ తాలూకు ప్రచారం కొంచెం టెన్షన్ పెడుతున్నా ప్రస్తుతానికి జనం థియేటర్లకు భారీగా తరలి వస్తున్నారు. సో ఆందోళన అక్కర్లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం గ్రాండ్ ప్లానింగ్ ఆల్రెడీ జరిగిపోయింది. గెస్టులు ఎవరు రాబోతున్నారో ఇంకా క్లారిటీ రాలేదు.

ఇదంతా బాగానే ఉంది కానీ పుష్ప పార్ట్ 2 వెంటనే మొదలుపెడతారా లేదా అనేదాని గురించి టీమ్ ఇంకా మాట్లాడ్డం లేదు. ఒకవేళ ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బన్నీ నెక్స్ట్ చేయబోయే సినిమా దర్శకుడు ఎవరో తెలియదు. వేణు శ్రీరామ్ తో ఐకాన్ ఉందన్నారు కానీ ఇప్పుడది కూడా అనుమానమే. మరోవైపు స్టార్ డైరెక్టర్లందరూ చాలా బిజీగా ఉన్నారు. ఒక్క బోయపాటి శీను మాత్రమే ఎవరికీ కమిట్ కాలేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సరైనోడు కాంబోని మరోసారి రిపీట్ చేయొచ్చన్న ప్రచారం జరిగింది కానీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయ్యేదాకా చెప్పలేం. అసలు కథ సిద్ధంగా ఉందో లేదో తెలియదు.

ఇదంతా చూస్తుంటే పుష్ప 2 వెంటనే మొదలుపెట్టడం తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు. కాకపోతే ఫలితం చాలా కీలకంగా మారుతుంది. బాహుబలి, కెజిఎఫ్ లాగా బ్లాక్ బస్టర్ అయితే సీక్వెల్ పై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. ఆటోమేటిక్ గా షూటింగ్ వెంటనే మొదలుపెట్టాలనే ఒత్తిడి పెరుగుతుంది. అలా కాకుండా జరిగితే ఇబ్బందే. మొత్తానికి డిసెంబర్ నెల చాలా హాట్ గా ఉండబోతోంది. అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ లాంటి గ్రాండియర్లతో పాటు లక్ష్య, గుడ్ లక్ సఖి, గమనం లాంటి మీడియం రేంజ్ మూవీస్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరి ఎన్ని గెలిచి నిలుస్తాయో చూడాలి

Also Read : Thaman : శుక్రమహర్దశ అనుభవిస్తున్న సంగీత దర్శకుడు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp