Ghani Teaser : ఎమోషన్ల యుద్ధంతో స్పోర్ట్స్ డ్రామా

By iDream Post Nov. 15, 2021, 12:30 pm IST
Ghani Teaser : ఎమోషన్ల యుద్ధంతో స్పోర్ట్స్ డ్రామా

వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న గని వచ్చే నెల 24 విడుదలకి సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ నిర్మాతగా పరిచయమవుతున్న ఈ సినిమాకు సిద్ధూ ముద్దా మరో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా డెబ్యూ చేస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా టీజర్ ని ఇందాక విడుదల చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఆర్టిస్టుల డైలాగులు ఏవీ లేకుండా డిఫరెంట్ గా కట్ చేశారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించడం గమనార్హం. నాని శ్యామ్ సింగ్ రాయ్ తో పాటు ఒకే రోజు పోటీకి దిగుతున్న గని మీద మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇక టీజర్ విషయానికి వస్తే చూచాయగా కథేంటో చెప్పారు. ఆట ఆడితే రికార్డులో ఉంటాం గెలిస్తే చరిత్రలో ఉంటాం అనే సూత్రాన్ని నమ్మిన గని బాక్సింగ్ కోసం తన ప్రాణం పెడతాడు. చిన్నప్పుడు తనకు తన తల్లికి ఎదురైన అవమానాలను ధీటుగా ఎగురుకుంటూ రాటు దేలుతాడు. అయితే ఇదంతా సాఫీగా జరగదు. అడుగడుగునా అడ్డంకులు. ఎత్తులు పైఎత్తులు వేసే శత్రువులు. వీటిని తట్టుకుని ఛాంపియన్ గా అవతరించాలని లక్ష్యం పెట్టుకుంటాడు. అండగా ప్రేయసి కూడా ఉంటుంది. మరి ఇంత యుద్ధంలో గని గెలుపు ఎలా సాధ్యమయ్యింది, తండ్రి ఎవరు, ప్రత్యర్థులు ఏం చేశారు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి.

ట్రైలర్ లో మంచి ఇంటెన్సిటి ఉంది. అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి ఛాయలు కాస్త కనిపించినా దీన్ని సీరియస్ ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి తీర్చిదిద్దినట్టు అనిపిస్తోంది. జగపతిబాబు, నదియా, నరేష్, నవీన్ చంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషించగా చాలా గ్యాప్ తర్వాత కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఇందులో ముఖ్యమైన క్యారెక్టర్ చేయడం విశేషం. తమన్ సంగీతం కూడా బాగా ఎలివేట్ అయ్యింది. అల్లు అర్జున్ పుష్ప వచ్చిన వారానికే అన్నయ్య బాబీ నిర్మాతగా డెబ్యూ చేసిన మూవీ వస్తుండటం గమనార్హం. పోటీ అని కాదు కానీ మరీ తక్కువ గ్యాప్ లో కాంపిటీషన్ పడుతుండటం విశేషం

Also Read : Evaru Meelo Koteeswarulu : కోటి గెలిచిన తెలంగాణా ఖాకీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp