ఓ కక్కుర్తి టీజర్ "వివాహ భోజనంబు" - TNR

By TNR Dec. 20, 2020, 01:11 pm IST
ఓ కక్కుర్తి టీజర్ "వివాహ భోజనంబు" - TNR
థియేటర్ లో విడుదలైన సినిమా విజయానికి మూడు రకాల కొలమాణాలు.
ఒకటి....టాక్ బాగా లేకపోయినా అద్భుతమైన కలెక్షన్స్ తో జేబు నింపే విజయం.
రెండు....కలెక్షన్స్ బాగాలేకపోయినా మంచి టాక్ సాధించి మనసు నింపే విజయం.
మూడు...మంచి టాక్ తో మంచి కలెక్షన్స్ తో అన్ని వర్గాలను ఆకట్టుకుని జేబు,మనసు రెండింటినీ నింపే విజయం.
ఇలాగే.... OTT లో విడుదలైన సినిమా విజయానికి కూడా మూడు రకాల కొలమాణాలు.
ఒకటి.....టాక్ బాగా లేకపోయినా అద్భుతమైన వ్యూస్ తో జేబు నింపే విజయం.
రెండు.....వ్యూస్ బాగాలేకపోయినా మంచి టాక్ సాధించి మనసు నింపే విజయం.
మూడు....మంచి టాక్ తో మంచి వ్యూస్ తో అన్ని వర్గాలను ఆకట్టుకుని జేబు,మనసు రెండింటినీ నింపే విజయం.
ఈ లెక్కన నా అభిప్రాయం ప్రకారం ఇప్పటి వరకు డైరెక్ట్ OTT లో విడుదలైన తెలుగు సినిమాల్లో మూడవ క్యాటగిరీకీ చెందిన సినిమాలు రెండే రెండు..
ఒకటి......"మిడిల్ క్లాస్ మెలొడీస్"
రెండవది ....( కాంట్రవర్సీ కి తావు లేకుండా మీ ఊహకే వదిలేస్తున్నా..)
ఇక ఆ మూడవ క్యాటగిరీలొ ఉండే మూడవ సినిమా మాత్రం ఖచ్చితంగా ఈ "వివాహ భోజనంబు" అవుతుందని నా నమ్మకం...
ఎన్నో అవరోధాలని ఎదుర్కుని త్వరలో OTT లో విడుదలవబోతోంది..
ఈ సినిమా హిలెరియస్ గా వచ్చింది..
దీని పూర్తి క్రెడిట్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు మరియు రైటర్స్ భాను & నందు కే ఇవ్వాలి.
ఈ కింది టీజర్ లో చూపించింది జస్ట్ 1 పర్సెంట్ మాత్రమే..
ఒక్కోసారి ఛాయిస్ ఎక్కువయినపుడు సెలెక్షన్ చాలా కష్టమవుతుంది..
అలా రెండుగంటల హిలెరియస్ కామెడీని కక్కుర్తి పడి రెండు నిమిషాల టీజర్ లో ఇరికించడం కొంచెం కష్టమైన పనే..
ఆ కక్కుర్తిలో ఆణిముత్యాలు జారిపోయే అవకాశం చాలా ఉంటుంది...
ప్రస్తుతానికి ఈ రెండు నిమిషాల టీజర్ తో సర్దిపెట్టుకుని రెండుగంటల నాన్ స్టాప్ కామెడీ కోసం కొద్ది రోజులు ఓపిక పట్టండి..
ఆల్ ద బెస్ట్ "వివాహ భోజనంబు"😍
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp