టాలీవుడ్ కు మరోసారి వైరస్ షాక్

By iDream Post Apr. 18, 2021, 01:30 pm IST
టాలీవుడ్ కు మరోసారి వైరస్ షాక్
టాలీవుడ్ షూటింగులకు మళ్ళీ కరోనా భూతం చుట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మెల్లగా కేసులు పెరగడం అందులోనూ హైదరాబాద్ లో తీవ్రత క్రమంగా పెరుగుతూ పోవడంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చే యూనిట్ సభ్యుల మధ్య స్టార్ హీరోల సినిమా షూట్లు దినదినగండంగా జరుగుతున్నాయి. నిన్న సోను సూద్ కి పాజిటివ్ రావడం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొన్న నగరం ఫ్లై ఓవర్ మీద సైకిల్ మీద  ఆచార్య షూటింగ్ కు వెళ్తూ వీడియోని షేర్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే ఇలా జరగడంతో కొరటాల టీమ్ షాక్ అయ్యింది. సోను సూద్ మీద ప్రస్తుతం చాలా కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. వాటికి బ్రేక్ పడింది.

ఇక కేవలం మూడు రోజుల క్రితం కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టిన ఎఫ్3 దర్శకుడు అనిల్ రావిపూడికి సైతం పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. అసలే ఆ యూనిట్ లో భారీ క్యాస్టింగ్ ఉంది. సాంకేతిక నిపుణులు కూడా ఎక్కువ మంది పని చేస్తున్నారు. సో అనిల్ తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళందరూ టెస్టింగ్ కు వెళ్లక తప్పదు. భాగ్యనగర శివార్లలో షూటింగ్ జరుపుకుంటున్న సర్కారు వారి పాట టీమ్ లో ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడంతో మహేష్ బాబు సూచనల మేరకు మొత్తం ఆపేశారు. నార్మల్ అయ్యాక తిరిగి రీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్యాకప్ చెప్పుకున్నారు. ఎప్పుడు రీ స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి.

ఇవి బయటికి తెలిసిన విషయాలు. చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాల షూటింగులలో ఎవరెవరికి పాజిటివ్ వచ్చిందో ఎన్ని టెస్టులు జరిగాయో తెలుసుకోవడం కష్టంగా మారింది. సిటీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నటీనటులు టెక్నికల్ టీమ్ లతో కరోనా ఏ రూపంలో ఎక్కడి నుంచి వస్తోందో పసిగట్టడం పెద్ద సవాల్ గా మారింది. రిలీజ్ డేట్లలో ఇప్పటికే విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే ఈ ఏడాది అక్టోబర్ నుంచి వచ్చే డిసెంబర్ దాకా ప్లాన్ చేసుకున్న తేదీలలో మార్పులు తప్పకపోవచ్చు. మొత్తానికి అంతా బాగుందని అనుకుంటున్న తరుణంలో ఇలా జరగడం కన్నా పెద్ద షాక్ ఏముంటుంది
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp