విక్రమాదిత్య ఇచ్చిన స్టోరీ క్లూ

By iDream Post Oct. 21, 2020, 05:25 pm IST
విక్రమాదిత్య ఇచ్చిన స్టోరీ క్లూ

ఇవాళ ప్రభాస్ కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే చెబుతూ రాధే శ్యామ్ యూనిట్ ఒక కొత్త పోస్టర్ విడుదల చేసింది. డార్లింగ్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో మొహం పూర్తిగా చూపించకుండా కిందకు చూస్తూ నవ్వుతూ మనసులు దోచుకునేలా ఉన్నాడు. ఇటలీ నేపథ్యం కావడంతో దానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ అక్కడి వాహనాలు దర్శనమిచ్చాయి. హీరో పేరు విక్రమాదిత్య అని రివీల్ చేశారు. మొన్నామధ్య హీరోయిన్ పూజా హెగ్డే లుక్ ని ప్రేరణగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. సో ఇద్దరి గురించి క్లారిటీ వచ్చేసింది. మరి టైటిల్ లో రాధే శ్యామ్ అని ఉండగా ఆ పేర్లతో కాకుండా విక్రమాదిత్య, ప్రేరణగా చెప్పడం ఏమిటనే సందేహం రావొచ్చుగా. అక్కడే ఉంది అసలు గుట్టు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది పునర్జన్మల కాన్సెప్ట్ తో రూపొందుతున్న సినిమా. గత జన్మలో రాధే శ్యామ్ గా ఉన్న ప్రేమికులు వర్తమానంలో విక్రమాదిత్య, ప్రేరణలుగా పుడతారు. అయితే రెగ్యులర్ గా మనం చూసే మగధీర, మూగ మనసులు ఫార్ములాలో కాకుండా దర్శకుడు రాధా కృష్ణ ఏదో ఊహించని ట్విస్టు పెట్టారట. అదేంటనేది తెరమీదే చూడాలంటున్నారు. రెండు లవ్ స్టోరీస్ అంటే అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా పండగే. అందులోనూ ఫారిన్ బ్యాక్ డ్రాప్ అంటే రిచ్ నెస్ ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాలా. అయితే ఇదంతా అధికారికంగా తెలిసింది కాకపోయినా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ ని స్పెషల్ గా వీడియో రూపంలో కట్ చేయించి సిద్ధంగా ఉంచారు. ట్రైన్ బ్యాక్ డ్రాప్ లో జస్టిన్ ప్రభాకరన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రత్యేకంగా ఎడిట్ చేయించిన ఈ ప్రోమో రాధే శ్యామ్ ప్రమోషన్ ని పీక్స్ కి తీసుకెళ్తుందని అంచనా. సంగీత దర్శకుడి పేరుని ఆ రోజే అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని డిసైడ్ అయినప్పటికీ ఈపాటికే లీకుల రూపంలో నిన్నే చక్కర్లు కొట్టేసింది. వచ్చే వేసవికి విడుదల ప్లాన్ చేసుకుంటున్న రాధే శ్యామ్ ని బాహుబలి 2 రిలీజ్ డేట్ కి లాక్ చేసుకుంటే ఎలా ఉంటుందన్న చర్చలు జరుగుతున్నాయని సమాచారం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp