బ్లాక్ బస్టర్ సిరీస్ లో విజయ్ సేతుపతి

By iDream Post Jun. 21, 2021, 02:00 pm IST
బ్లాక్ బస్టర్ సిరీస్ లో విజయ్ సేతుపతి

ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి వరల్డ్ బెస్ట్ వెబ్ సిరీస్ అని టైపు చేస్తే వచ్చే టాప్ 5లో ఫ్యామిలీ మ్యాన్ ఉంటుంది. ఇంగ్లీష్ లోకి కనీసం డబ్బింగ్ చేయకుండా కేవలం హిందీ వెర్షన్ తోనే ఈ స్థాయిలో స్పందన తెచ్చుకోవడం చూసి అమెజాన్ ప్రైమ్ సంతోషం అంతా ఇంతా కాదు. సినిమా రేంజ్ లో దీనికి యాభై కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినందుకు దానికి మించిన ఫలితం దక్కింది. ముఖ్యంగా సెకండ్ సీజన్ లో సమంతా విలన్ గా చేయడం ఆ పాత్రతో పాటు శ్రీలంక ఎల్టిటిఈ నేపధ్యం కూడా బాగా వర్కౌట్ అవ్వడంతో ఇప్పుడు తెలుగు తమిళంలోకి అనువదించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఇప్పుడు మరో హాట్ అప్ డేట్ తోడయ్యింది.

సామ్ క్యారెక్టర్ రెండో భాగం చివరి ఎపిసోడ్ లో చనిపోయింది కాబట్టి ఇక కొనసాగించడానికి లేదు. ఒకవేళ తప్పించుకున్నట్టు చూపించినా ఆ కథను ఇంకా పొడిగించడానికి స్కోప్ లేదు. అందుకే ఈసారి కరోనా వైరస్ ని కాన్సెప్ట్ గా తీసుకుంటున్న దర్శకులు రాజ్ అండ్ డీకేలు విలన్ గా విజయ్ సేతుపతిని తీసుకునే ప్లానింగ్ లో ఉన్నారట. ఇప్పటికే ఒక సిట్టింగ్ అయ్యిందని మక్కల్ సెల్వన్ పాజిటివ్ గా స్పందించాడని చెన్నై టాక్. అయితే దీనికి షూటింగ్ టైం, కాల్ షీట్స్ చాలా ఎక్కువ అవసరం అవుతాయి కాబట్టి ముందు డీల్ కుదిరితే అప్పుడు వాటి గురించి ఆలోచించవచ్చు. సామ్ కే నాలుగు కోట్ల దాకా ఇచ్చినప్పుడు ఇతను ఏ రేంజ్ లో డిమాండ్ చేస్తాడో

ఇది ఎప్పుడు మొదలైనా ఫ్యామిలీ మ్యాన్ 3 వచ్చేది మాత్రం 2023లోనే నట. అంతకన్నా ముందు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఈసారి బడ్జెట్ పెంచడంతో పాటు ఫారిండ్ లొకేషన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుందట. క్వాలిటీలో రాజ్ డీకేలు నో కాంప్రోమైజ్ బ్యాచ్ కాబట్టి హడావిడిగా చేయరు. మొత్తానికి ఒక ఇండియన్ వెబ్ సిరీస్ కి ఈ స్థాయిలో స్పందన దక్కడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు దీన్ని స్ఫూర్తిగా తీసుకునే ఇతర ఓటిటిలు కూడా ఈ తరహా భారీ సిరీస్ లకు ప్లాన్ చేసుకుంటున్నాయి. చూస్తుంటే మనీ హీస్ట్, బ్రేకింగ్ బ్యాడ్ తరహాలో మన భాషలోనూ హై స్టాండర్డ్ కంటెంట్ చూడొచ్చన్న మాట

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp