తెలుగు తమిళ ఫ్యాన్స్ మధ్య ఫస్ట్ లుక్ చిచ్చు

By Ravindra Siraj Jan. 23, 2020, 11:31 am IST
తెలుగు తమిళ ఫ్యాన్స్ మధ్య ఫస్ట్ లుక్ చిచ్చు

మొన్న విడుదలైన వెంకటేష్ నారప్ప ఫస్ట్ లుక్ తెలుగు ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల వెంకీని ఎలా చూపిస్తాడా అనే అనుమానాలకు చెక్ పెడుతూ పోస్టర్లతో డిస్టిన్క్షన్ లో పాస్ అయిపోయింది యూనిట్. అయితే కథ అక్కడితో అయిపోలేదు. ఒరిజినల్ వెర్షన్ అసురన్ లోని ధనుష్ లుక్ తో వెంకటేష్ ని పోలుస్తూ తమిళ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు తెరతీశారు. తెలుగు వాళ్ళు తమ సినిమాలోని ఫీల్ ని క్యారీ చేయలేరని వెంకటేష్ లాంటి సీనియర్ నటుడు ఆ పాత్రను పండించలేరని రకరకాలుగా మేమ్స్ తయారు చేసి వదిలారు. అవి గంటల్లోనే వైరల్ అయ్యాయి.

Read Also: 28 ఏళ్ళ తర్వాత వెంకటేష్ ఇలా

దీనికి ఒళ్ళు మండిన తెలుగు నెటిజెన్లు దానికి ధీటుగా బదులిస్తూ ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తండ్రి చనిపోయే సీన్ లో వెంకీ నటనను అదే సినిమా తమిళ వెర్షన్ లో ధనుష్ ఎక్స్ ప్రెషన్లను పోలుస్తూ రిటార్ట్ ఇచ్చారు. సరే మేమేం తక్కువ తిన్నామా అంటూ అసురన్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొన్ని చూపించి వెంకీ యంగ్ లుక్ ని ఎలా చూపిస్తారో అంటూ ఇంకో కౌంటర్ ఇచ్చారు. ఇది రెండు రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. దీంతో ఒళ్ళు మండిన హీరో సిద్ధార్థ మన సౌత్ లో యూత్ ఇంత యాక్టివ్ గా చాలా గొప్ప విషయం మీద సమయం ఖర్చు పెడుతున్నారని అందుకే గర్వంగా ఉందని చురకలు వేస్తూ ట్వీట్ చేసాడు.

Read Also: నారప్ప ఉగ్రరూపం : ఫస్ట్ లుక్

నిజానికి ఈ వ్యవహారమంతా అతి లెవెల్ ని మించి పోయింది. అసలే మాటల యుద్ధంలో ట్రోల్స్ ని ప్రమోట్ చేయడంలో అరవ ఫ్యాన్స్ అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. అలాంటిది అసురన్ టాపిక్ దొరికేసరికి ఇంకా రెచ్చిపోవడం మొదలుపెట్టారు. ధనుష్ స్కూల్ కు వెళ్తున్న వయసులోనే వెంకటేష్ నంది అవార్డు తీసుకున్నారని అసలు ఈ పోలిక ఏంటని ఓ నెటిజెన్ ఓ రేంజ్ లో క్లాస్ పీకడం కొసమెరుపు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp