వరుణ్ కి జోడిగా విలన్ కూతురు

By Ravindra Siraj Feb. 20, 2020, 04:40 pm IST
వరుణ్ కి జోడిగా విలన్ కూతురు

గత ఏడాది ఎఫ్2 లాంటి ఇండస్ట్రీ హిట్ ని, గద్దలకొండ గణేష్ లాంటి కమర్షియల్ సేఫ్ వెంచర్ ని తన ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నాడు. బాక్సింగ్ నేపధ్యంలో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు తీయబోతున్న ఈ మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిపోయింది. తాజాగా హీరొయిన్ ఎంపిక కూడా పూర్తయ్యిందని సమాచారం. దబాంగ్ 3లో సల్మాన్ ఖాన్ సరసన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నటించిన సాయి మంజ్రేకర్ ను సెలెక్ట్ చేసినట్టు తెలిసింది.

ఈ అమ్మాయి ప్రముఖ దర్శకుడు కం విలన్ వేషాలు వేసే మహేష్ మంజ్రేకర్ కూతురు. దబాంగ్ 3 బ్లాక్ బస్టర్ కాకపోయినా ఈ అమ్మడి లుక్స్ కి యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. ఫ్రెష్ బ్యూటీ కాబట్టి ప్రేక్షకులకూ ఆ ఫీలింగ్ వస్తుందనే ఉద్దేశంతో తీసుకున్నారట. ఈ మధ్య కాలం విలన్ కూతుళ్ళు తెరను బాగానే ఏలుతున్నారు. చాలా కాలం పాటు బాలీవుడ్ విలన్లలో ఒకడిగా వెలిగిన శక్తి కపూర్ వారసురాలు శ్రద్ధా కపూర్ ఇప్పటికే తనకంటూ ఒక ఇమేజ్ ని స్టేటస్ ని తెచ్చుకుంది. సాహో కోసం ఏరికోరి మరీ తననే తీసుకున్నారు.

ఇప్పటికీ శ్రద్ధా నాలుగైదు సినిమాలతో పిచ్చ బిజీగా ఉంది. ఇప్పుడు సాయి మంజ్రేకర్ వంతు వచ్చింది. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా బాడీ బిల్డింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకటేష్ అలియాస్ బాబీతో సందీప్ నిర్మిస్తున్న ఈ మూవీకి ఇంకా టైటిల్ డిసైడ్ కాలేదు. ఈ సినిమా కనక హిట్ అయితే సాయి మంజ్రేకర్ ఇక్కడ మంచి ఆఫర్స్ దక్కే ఛాన్స్ ఉంటుంది. బాక్సింగ్ నేపధ్యంలో అమ్మానాన్న తమిళ అమ్మాయి తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. అందుకే దీని మీద అంచనాలు భారీగా ఉన్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp