అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు

By Sodum Ramana Nov. 28, 2019, 08:17 am IST
అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు

"క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు" సినిమా పేరు మార్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఒక టీవీ చాన‌ల్‌లో ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ‌తో జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న సూచ‌న‌ప్రాయంగా ఈ విష‌యాన్ని చెప్పాడు. సినిమాను 29వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు ప్ర‌క‌టించారు. విడుద‌ల‌కు ఒక‌రోజు ముందు సెన్సార్‌బోర్డు ముందుకు సినిమా వెళ్ల‌నుంది.

అంతేకాకుండా "క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు" సినిమా రెండు కులాల మ‌ధ్య చిచ్చుపెట్టే అవ‌కాశం ఉంద‌ని, కావున విడుద‌ల‌ను నిలుపుద‌ల చేయాల‌ని కొంద‌రు హైకోర్టులో పిటిష‌న్లు వేశారు. ఈ నేప‌థ్యంలో సెన్సార్‌బోర్డు సినిమా పేరుపై ఒక‌వేళ అభ్యంత‌ర చెబితే మార్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్టు రాంగోపాల్‌వ‌ర్మ చర్చ‌లో భాగంగా చెప్పాడు.

కొత్త పేరు పెట్టాల్సి వ‌స్తే "అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు" అని మారుస్తామ‌ని ఆయ‌న వివ‌రించాడు. అంటే రాజీప‌డుతున్నారా అనే ప్ర‌శ్న‌కు ఒక‌దాన్ని ప‌ట్టుకుని మొత్తం సినిమా విడుద‌ల‌ను నిలుపుకోలేం క‌దా అన్నాడు. అయినా ఇప్ప‌టికే సినిమాపై జ‌ర‌గాల్సిన చ‌ర్చ జ‌రిగింది క‌దా అని రాంగోపాల్‌వ‌ర్మ అన్నాడు.

"అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు " సినిమాలో అమ్మ అంటే విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌గా ఆయ‌న పేర్కొన్నాడు. అలాగే సినిమాకు సంబంధించిన అనేక విష‌యాల‌ను ఆయ‌న చెప్పాడు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై ఇలాంటి సినిమా తీస్తారా అనే ప్ర‌శ్న‌కు ఆయ‌న కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పాడు. చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేశ్ అంటే ఎందుకంత క‌క్ష‌? జ‌గ‌న్‌పై ఎందుకంత ప్రేమ అనే ప్ర‌శ్న‌కు ఆయ‌న అలాంటివేవీ లేవ‌న్నాడు.

జ‌గ‌న్‌పై సినిమా తీయ‌న‌ని చెప్ప‌డం వెనుక ప‌క్ష‌పాతం లేదా అని అడ‌గ్గా.... జ‌గ‌న్‌లో ట్రోలింగ్ చేయ‌డానికి ఏమీ లేవ‌ని, ఒక‌వేళ ఏమైనా ఉంటే మీరే చెప్పాల‌ని ఆయ‌న ఎదురు ప్ర‌శ్నించాడు. కేఏ పాల్ త‌న‌కు మిత్రుడ‌ని ఆయ‌న వ్యంగ్యంగా అన్నాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp