రికార్డు దాటలేకపోయిన వకీల్ సాబ్

By iDream Post Jul. 29, 2021, 02:30 pm IST
రికార్డు దాటలేకపోయిన వకీల్ సాబ్

భారీ మార్కెటింగ్ క్యాంపైన్ తో కనివిని ఎరుగని పబ్లిసిటీతో జీ తెలుగు ఛానల్ టెలికాస్ట్ చేసిన వకీల్ సాబ్ వరల్డ్ ప్రీమియర్ టిఆర్పి రేటింగ్ వచ్చేసింది. పవన్ ఫ్యాన్స్ ఆశించినట్టు రికార్డులు బద్దలు కాలేదు కానీ ఈ ఏడాది మటుకు టాప్ వన్ లో నిలిచింది. అదొక్కటే ఊరట. విడుదలైన వంద రోజులకు ప్రసారమైన వకీల్ సాబ్ ని టీవీలో భారీ ఎత్తున జనం విరగబడి చూస్తారనేఅంచనా కొంచెం లెక్క తప్పింది. ఒక రకంగా 19.12 అనేది పెద్ద రేటింగ్ అయినప్పటికీ గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్స్ తో పోలిస్తే ఇది తక్కువే. జెమిని అంత పాపులారిటీ వ్యూయర్ షిప్ లేని జీలో ప్రసారం కావడం కూడా కొంత ప్రభావం చూపించిందని అభిమానులు అంటున్నారు.

ఇప్పటిదాకా వచ్చిన వాటిలో ఆల్ టైం నెంబర్ వన్ ప్లేస్ లో అల వైకుంఠపురములో 29.4 తో ఉండగా ఆ తర్వాత స్థానంలో సరిలేరు నీకెవ్వరు 23.4 తో కొనసాగుతోంది. నెక్స్ట్ అలా చెప్పుకుంటూ పోతే బాహుబలి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ తదితరాలు వస్తాయి. 2021లో వచ్చిన వాటిలో మాత్రం వకీల్ సాబ్ దే ప్రధమ స్థానం. ఆ తర్వాత ఉప్పెన 18.5 తో ఉండగా క్రాక్ 11.7 తో మూడో ప్లేస్ ను తీసుకున్నాయి. అటుపై జాంబీ రెడ్డి ఉంది. మొత్తంగా చూసుకుంటే వకీల్ సాబ్ కు వచ్చిన స్పందన కొంచెం సంతోషం కొంచెం బాధ అనేలా ఉంది. రెండు రోజుల క్రితం దీనికి 32 రేటింగ్ వచ్చిందని సోషల్ మీడియాలో జరిగిన ఫేక్ ప్రచారానికి బ్రేక్ పడింది.

దీన్ని బట్టి అర్థమవుతోందేంటే ఇండస్ట్రీ హిట్లకు ఓటిటి స్ట్రీమింగ్ తో సంబంధం లేకుండా టిఆర్పి లు వచ్చేస్తాయి. అలా కాకుండా కమర్షియల్ గా సక్సెస్ అందుకున్న క్రాక్, వకీల్ సాబ్ లాంటివి 20 లోపలే నిలిచిపోతాయి. ఈ ట్రెండ్ ఇకపై కూడా కొనసాగుతుంది. కేవలం నాలుగు వారాల లోపే ఓటిటిలో కొత్త సినిమాలు వస్తున్న నేపథ్యంలో శాటిలైట్ ఛానల్స్ కు రేటింగ్స్ రావడం కొంచెం కష్టమయ్యింది. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ సామాన్యులకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు కాబట్టి సరిపోయింది కానీ ఒకవేళ సెల్ ఫోన్ లా ఇది కూడా సాధారణం అయిపోతే ఈ సమీకరణాలు మొత్తం మారిపోతాయి

Also Read: చిరు పేరుని లాక్ చేశారా ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp