6 నెలల తర్వాత 'వి'కి కోర్టు షాక్

By iDream Post Mar. 04, 2021, 11:14 am IST
6 నెలల తర్వాత 'వి'కి కోర్టు షాక్

కోర్టు వ్యవహారాలు కొన్నిసార్లు అంతే. న్యాయం జరిగే లోపు పుణ్యకాలం కాస్తా కర్పూరమైపోతుంది. అయినా కూడా బాధితులకు ఊరట కలిగేలా ఇలాంటి చర్యలు అవసరమే. కాకపోతే అప్పటిదాకా జరిగిన జాప్యం వల్ల నష్టం పాలు ఎంత పెరిగిందనే దాని మీదే ఇక్కడ తప్పా ఒప్పా అనేది ఆధారపడి ఉంటుంది. ఇక విషయానికి వస్తే గత ఏడాది లాక్ డౌన్ టైంలో థియేటర్లు మూతబడిన కారణంగా నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన నాని వి ఫలితం సంగతి పక్కనపెడితే భారీ క్రేజీ ఉన్న సినిమాగా కొన్ని కోట్ల ప్రేక్షకులు ఆన్ లైన్ వేదికగా చూశారు. అఫీషియల్ గా వీళ్లయితే ఇక పైరసీ రూటులో చూసిన వాళ్ళ లెక్క చెప్పడం కష్టం.

ఇందులో ఓ సన్నివేశంలో మోడల్ కం హీరోయిన్ సాక్షి మాలిక్ ఫోటోని ఓ సన్నివేశంలో సెక్స్ వర్కర్ గా చూపించడం ఇంత రచ్చకు కారణం అయ్యింది. తన అనుమతి లేకుండా ఇలా ఫొటోగ్రాఫ్ ని వాడుకోవడం ద్వారా తన ఇమేజ్ కి భంగం కలిగించడంతో పాటు వ్యక్తిగత సమాచార గోప్యతకు సంబంధించి హక్కులు హరించారని నిర్మాత దిల్ రాజు మీద ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదన విన్న కోర్టు సాక్షి మాలిక్ వైపే తీర్పు చెప్పింది. అన్ని భాషల్లోనూ వి సినిమాను తీసేయాలని ప్రైమ్ ని ఆదేశించింది. దీంతో ప్రస్తుతానికి ఈ సినిమా ఆ యాప్ లో డిలీట్ అయ్యింది.

ఒకవేళ మళ్ళీ అప్ లోడ్ చేయాలనుకునే పక్షంలో కోర్టు పెర్మిషన్ తో పాటు సాక్షికి ఎడిటింగ్ చేసిన వెర్షన్ మళ్ళీ చూపించి ఆ తర్వాత స్ట్రీమింగ్ చేయాలని ఆర్డర్ వేసింది. అసలే ఈ మధ్య వెబ్ సిరీస్ వివాదాలతో తలబొప్పి పడుతున్న ప్రైమ్ కు ఇప్పుడు వి రూపంలో కొత్త షాక్ తగిలింది. గతంలో శివ కార్తికేయన్ శక్తి సినిమా విషయంలోనూ ఇలాగే జరగడం గమనార్హం. ఇంతకీ ఆ ఫోటో ఎలా వాడారంటే ఎప్పుడో 2017లో తన ఇన్స్ టా అకౌంట్ లో పోస్ట్ చేసిన సాక్షి ఫోటోని ఏమరుపాటులో తీసుకున్నారో ఎవరు పట్టించుకోరు అనుకున్నారో కానీ మొత్తానికి చిన్న పొరపాటు ఇలా పెద్ద మూల్యానికి దారి తీసేలా చేసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp