బ్లాక్ బస్టర్ జంట రిపీట్ అవుతుందా

By iDream Post Apr. 17, 2021, 12:00 pm IST
బ్లాక్ బస్టర్  జంట రిపీట్ అవుతుందా

ఈ ఏడాది ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో పెట్టుబడి-రాబడి లెక్కల్లో టాప్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఉప్పెన ఎంత సంచలనమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు రోజుల క్రితం ఓటిటి, రేపు శాటిలైట్ ద్వారా ప్రీమియర్ కాబోతున్న ఈ మూవీకి యూత్ ఎంతగా కనెక్ట్ అయ్యారో విడుదలకు ముందు ఎవరూ ఊహించనిది. హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్-కృతి శెట్టి జోడితో పాటు దర్శకుడు బుచ్చిబాబు సన పేరు ఇండస్ట్రీ మొత్తం మారుమ్రోగిపోయింది. దీంతో తనకు బాగా సన్నిహితుడైన జూనియర్ ఎన్టీఆర్ తో రెండో సినిమా ఉండొచ్చనే ప్రచారం గట్టిగానే జరిగింది. ఓ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాను రెడీ చేశారని, త్వరలోనే గుడ్ న్యూస్ వినొచ్చనేలా టాక్ వచ్చింది.

అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం తారక్ ను బుచ్చిబాబు ఫైనల్ గా కన్విన్స్ చేయలేకపోయారట. ఇంతకంటే మంచి కథతో వస్తే అప్పుడు చూద్దామని యంగ్ టైగర్ మాటివ్వడంతో మరోసారి ఉప్పెన కాంబినేషన్ ని రిపీట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. వైష్ణవ్ కృతిలకు సరిపడా మరో లవ్ స్టోరీ బుచ్చిబాబు దగ్గర రెడీగా ఉందట. ఎలాగూ మైత్రి వాళ్ళకే రెండో సినిమా చేయాలి కాబట్టి ఈ సబ్జెక్టు నచ్చడంతో దాదాపు ఓకే చెప్పినట్టు తెలిసింది. కానీ షూటింగ్ ఇప్పటికిప్పుడు మొదలయ్యే అవకాశం మాత్రం తక్కువ. ఎందుకంటే ఆ ఇద్దరూ కొత్త ప్రోజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. టైం పడుతుంది.

ఇలా సూపర్ హిట్ జోడి కాంబోలను రిపీట్ చేయడం కొత్తేమి కాదు కానీ డెబ్యూ చేసిన జంటనే మళ్ళీ ఇంకోసారి చూపించే ప్రయత్నం చేయడం ఇటీవలి కాలంలో జరగలేదు. బుచ్చిబాబు ఇదయ్యాక తారక్ ని మరో ఫ్రెష్ సబ్జెక్టుతో కలిసే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ లవ్ స్టోరీకే ఊహించని ట్విస్టుని జోడించి ప్రేక్షకులను మెప్పించిన బుచ్చిబాబు నిజంగా మరోసారి ప్రేమకథను ఎంచుకుంటే ఇప్పడే పాయింట్ ని టచ్ చేస్తాడో వేచి చూడాలి. రెండోది కూడా బ్లాక్ బస్టర్ పడితే స్టార్ హీరోల పిలుపులను ఆశించవచ్చు. గురువు సుకుమార్ బాటలోనే వెళ్తున్న బుచ్చిబాబు సన మూడో చిత్రం మాత్రం స్టార్ తో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp