రాధే శ్యామ్ విడుదల లాక్ అయ్యిందా

By iDream Post Jan. 24, 2021, 12:48 pm IST
రాధే శ్యామ్ విడుదల లాక్ అయ్యిందా

ప్రభాస్ ఫ్యాన్సే కాదు యావత్ భారతదేశ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాధే శ్యామ్ విడుదలకు యువి సంస్థ పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు సమాచారం. సాహో విషయంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే టీజర్ కూడా తొందరపడి రిలీజ్ చేయలేదని చెబుతున్నప్పటికీ డార్లింగ్ అభిమానులు ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే రెండు క్యారెక్టర్ టీజర్లు విడుదల చేయగా రాధే శ్యామ్ మాత్రం చిన్న మోషన్ పోస్టర్ తో సర్దిపెట్టిందని గుర్రుగా ఉన్నారు. మధ్యలో వదిలిన పోస్టర్లు బాగున్నాయి కానీ అంత కిక్ ఇవ్వని మాట వాస్తవం.

లేటెస్ట్ అప్ డేట్ మేరకు రాధే శ్యామ్ ని సమ్మర్ గిఫ్ట్ గా జులై 12న థియేటర్లలోకి తీసుకురావాలని ప్రాధమికంగా డిసైడ్ చేసినట్టు సమాచారం. అయితే కెజిఎఫ్ చాప్టర్ 2 డేట్ ఇంకా లాక్ చేయలేదు. ఈ రెండూ ముఖాముఖి తక్కువ గ్యాప్ లో తలపడటం అంత సేఫ్ కాదు. సో ఇద్దరిలో ఒకరు ముందు ఫిక్స్ అయితే మిగిలిన సినిమా దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకుంటుందన్న మాట. అందుకే తామే కొంత అడ్వాన్స్ గా ఉండాలన్న ఉద్దేశంతో రాధే శ్యామ్ టీమ్ తేదీ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేయాలని భావిస్తోందట. ఇంకొద్ది రోజుల్లో కొత్త టీజర్ తో పాటు దీన్ని అఫీషియల్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

మార్చ్ నుంచి మొదలయ్యే బాక్సాఫీస్ పోటీ ఏప్రిల్ లో పీక్స్ కు వెళ్లనుంది. ఆచార్య, వకీల్ సాబ్, నారప్ప అన్నీ వరసబెట్టి అలరించబోతున్నాయి. వీటి మధ్యలో కాకుండా రాధే శ్యామ్ సోలోగా రావాలన్నదే డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయం. ఇలా రావడం వల్లే నెగటివ్ టాక్ వచ్చినా సాహోకు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. రాధే శ్యామ్ పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి బాలీవుడ్ ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికీ సూర్యవంశీ, 83 లాంటి క్రేజీ మూవీస్ ఎప్పుడు వస్తాయనే క్లారిటీ లేదు. మన లాగే అక్కడా చాలా పెద్ద క్యూ విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. మొత్తానికి రాధే శ్యామ్ గుడ్ న్యూస్ త్వరలోనే రావొచ్చు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp