ప్రభాస్ సినిమాలకు తప్పని చిక్కులు

By iDream Post May. 22, 2020, 11:44 am IST
ప్రభాస్ సినిమాలకు తప్పని చిక్కులు

ఏ ముహూర్తంలో బాహుబలి ఒప్పుకున్నాడో ప్రభాస్ కు దాని వల్ల గొప్ప పేరైతే వచ్చింది కానీ దాంతో మొదలు ప్రతి సినిమాకు కనీసం రెండేళ్లకు పైగా గ్యాప్ మాత్రం కంపల్సరీ అయిపోయింది. ఎంత ప్లాన్ గా చేసుకున్నా ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతూనే ఉంది. అభిమానులు సైతం తమ హీరోని సంవత్సరానికి ఒక్కసారైనా చూసుకుందాం అనుకుంటే ఆ అవకాశం లేకుండా పోతోంది. తాజాగా డార్లింగ్ 20, 21 సినిమాలకు సైతం చిక్కులు వెంటాడుతున్నాయి. జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఇప్పటిదాకా ఖచ్చితంగా చెప్పడం లేదు.

షూటింగ్ ఏమో నలభై శాతం దాకా పూర్తయ్యింది. సైరాకు పని చేసిన బాలీవుడ్ ప్రోడక్ట్ అమిత్ త్రివేది దీనికీ కంపోజ్ చేస్తారనే టాక్ వచ్చింది కానీ తాను ఈ ప్రాజెక్ట్ లో లేనట్టుగా బాలీవుడ్ మీడియా నుంచి వస్తున్న ఫ్రెష్ అప్ డేట్. మరి ఎవరిని రీ ప్లేస్ చేస్తారో చూడాలి. సాహో విషయంలో కూడా ఇలాంటి పొరపాటే చేసి ఆఖరికి ఒక్కో ట్యూన్ ఒక్కొక్క సంగీత దర్శకుడితో చేయించుకుని ఆఖరికి బ్యాడ్ ఆల్బమ్ మిగిల్చారు. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ప్రభాస్ 21 నాగ అశ్విన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి టీమ్ ని సెట్ చేసుకోవడంలో దర్శకుడు బిజీగా ఉన్నాడు. హీరోయిన్ గా ఆర్ఆర్ఆర్ భామ అలియా భట్ ను గట్టిగానే ట్రై చేస్తున్నారట కానీ తన డేట్స్ దొరకడం చాలా కష్టంగా ఉందని వినికిడి.

పోనీ ఇక్కడే ఎవరైనా చూద్దాం అనుకుంటే పూజా హెగ్డే ఆల్రెడీ ముందు సినిమాలో హీరోయిన్. రష్మిక మందన్న ఇలాంటి ఫాంటసీ సబ్జెక్టుకు నప్పదని అనుకున్నారట. ఇక మిగిలిన వాళ్లలో అంతగా ఆప్షన్ గా చూడాల్సిన వాళ్ళు కాదని చర్చలు జరుగుతున్నాయట. ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ ముందు ఒక మాట అనేసుకుని ఫిక్స్ చేసుకుంటే ఆ తర్వాత ఇబ్బందులు రాకుండా ఉంటాయని నాగ అశ్విన్ ప్లాన్. లాక్ డౌన్ అయ్యాక పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. అందుకే దర్శక నిర్మాతలు చేయబోయే సినిమాలకు సంబంధించిన పనులను సైతం ఇప్పటి నుంచే షెడ్యూల్ చేసుకుంటున్నారు. మొత్తానికి ప్రభాస్ 20 ఈ ఏడాది వచ్చే అవకాశం దాదాపు లేనట్టే. ఇదే కనక జరిగితే నాగ అశ్విన్ మూవీ 2022కు షిఫ్ట్ అవ్వడం తప్ప వేరే మార్గం లేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp