మహేశుడు - డేట్ లాక్ చేసుకున్నాడు

By iDream Post Jul. 02, 2020, 12:09 pm IST
మహేశుడు - డేట్ లాక్ చేసుకున్నాడు

ఒకవైపు హిందీ, తమిళంలో ఓటిటి రిలీజుల ప్రవాహం కొనసాగుతుండగా తెలుగులో మాత్రం మెల్లగా అడుగులు పడుతున్నాయి. క్రేజీ సినిమాలు, పెద్ద బ్యానర్ల చిత్రాలేవీ లేవని ఫీలవుతున్న ప్రేక్షకులకు ఊరట కలిగించేందుకు మహేశుడు రెడీ అవుతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన మహేషింటే ప్రతీకారంని తెలుగులో ఉమామహేష్వర ఉగ్రరూపస్యగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కు ముందు ఏప్రిల్ లో ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ ని నిరవధికంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఇక థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఇప్పుడీ మూవీని డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నారు.

జులై 15న నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. బాహుబలి లాంటి విజువల్ వండర్ నిర్మించిన ఆర్కా మీడియా దీనికి ప్రొడక్షన్ హౌస్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. అందులోనూ టీజర్ ఇప్పటికే పాజిటిక్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఒక చిన్న ఊరిలో ఫోటోగ్రాఫర్ గా జీవనం సాగించే హీరో పక్కఊరి వాడితో అనుకోకుండా జరిగిన గొడవ వల్ల అనూహ్య రీతిలో ఒక శపథం చేస్తాడు. దాన్ని నెరవేర్చుకోవడమే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కథ. ఒరిజినల్ వర్షన్ లో నటించిన ఫర్హాడ్ ఫాసిల్ అక్కడ విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు.

ఇక్కడా సత్యదేవ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ చేయడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. కేరాఫ్ కంచెరపాలెంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న వెంకటేష్ మహా దీన్ని కూడా అదే తరహాలో తీర్చిదిద్దిఉంటారన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. రీమేక్ అయినప్పటికి తెలుగు నేటివిటీకి తగ్గట్టు కీలక మార్పులు చేశారు. హీరో తర్వాత అంత ప్రాధాన్యం ఉండే పాత్రలో సీనియర్ నరేష్ నటిస్తుండగా సుహాస్, రామ్ ప్రసాద్, రవీంద్ర విజయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. నేషనల్ అవార్డ్ విన్నర్ బిజ్బల్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. సో జూలై 15న మరో టాలీవుడ్ క్రేజీ ప్రీమియర్ కి రెడీ అవ్వండి మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp