త్రివిక్రమ్ సేఫ్ గేమ్ ఎంత కాలం

By Ravindra Siraj Jan. 13, 2020, 06:19 pm IST
త్రివిక్రమ్ సేఫ్ గేమ్ ఎంత కాలం

 నిన్న విడుదలైన అల వైకుంఠపురములో మంచి రిపోర్ట్స్ తో భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఓవర్ సీస్ లో కొన్ని దేశాల్లో సరిలేరుని మించే కలెక్షన్స్ వచ్చాయని రిపోర్ట్స్ ఉన్నాయి. త్రివిక్రమ్ మార్కు డైలాగులతో ఎంటర్ టైన్ మెంట్ పుష్కలంగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లను నింపుతున్నారు. ఈ వారం మొత్తం పండగ సెలవులు కొనసాగనున్నాయి కాబట్టి రికార్డుల మోత ఖాయమయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు సరిలేరు నీకెవ్వరు మంచి పోటీ ఇస్తోంది. సందడి తగ్గాక ఎవరు స్టడీగా కలెక్షన్లు నిలబెట్టుకుంటారో అనేది ఆసక్తి కరంగా మారింది. 

రెస్పాన్స్ సంగతి కాసేపు పక్కనబెడితే త్రివిక్రమ్ ఒకే టెంప్లెట్ కు కట్టుబడి కొత్తగా ఆలోచించడం లేదన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. చూచాయగా గమనిస్తేనే అల వైకుంఠపురములోకు త్రివిక్రమ్ గత సినిమాలు అత్తారింటికి దారేది, జులాయి, అజ్ఞాతవాసి పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పాత్రల విషయంలో. అత్తారింటికి దారేది చూస్తే బోమన్ ఇరానీని పోలిన పాత్రలో సచిన్ కెడ్కర్, నదియా తరహాలో టబు, రావు రమేష్ టైపులో జయరాం, జులాయిలో భరణిని పోలిన రోల్ లో మురళీశర్మ కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ పృథ్వి పోసాని టీమ్ కు వార్నింగ్ ఇచ్చే సీన్లు ఫైట్లు ఇందులోనూ ఉన్నాయి. ఇలా చాలా విషయాల్లో సారూప్యత ఉంది.

నితిన్ అఆతో కలిపి ఈ అన్ని సినిమాల్లో కామన్ గా కనిపించేది ఓ పెద్ద రిచ్ ఫ్యామిలీ సెటప్. ఇందులోనూ రిపీట్ అయ్యింది. రాజమౌళి,సుకుమార్ తరహాలో త్రివిక్రమ్ అవుట్ అఫ్ ది బోర్డు ఆలోచించడం లేదన్నది స్పష్టమవుతోంది. డిఫరెంట్ జానర్స్ లో కథలను ట్రై చేయడానికి ఆసక్తి లేనట్టే ఉంది. ముందుముందు ఒక దశలో ఇదే రొటీన్ ఫార్ములాగా మారిపోయి బోర్ కొట్టించే అవకాశాలు లేకపోలేదు. మరి అప్పటిదాకా త్రివిక్రమ్ వెయిట్ చేస్తాడా లేక నెక్స్ట్ మూవీ కొత్త పాయింట్ తో ఏదైనా ట్రై చేస్తాడా వేచి చూడాలి.idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp