లేడీ డైరెక్టర్స్ తీసిన తెలుగు సినిమాలల్లో టెక్నికల్ గా ఇంత స్ట్రాంగ్ సినిమా లేదు - TNR

By TNR Mar. 12, 2020, 08:55 pm IST
లేడీ డైరెక్టర్స్ తీసిన తెలుగు సినిమాలల్లో టెక్నికల్ గా ఇంత స్ట్రాంగ్ సినిమా లేదు - TNR

ఈరోజు సినిమా “MADHA”.
ఈ సినిమాని నేను మూడు నెలల ముందే చూడటం జరిగింది.
బాగుంది.
అనవసరపు కమర్షియల్ సినిమా ఎలిమెంట్స్ ఏమీ లేకుండా చేసిన ఒక సిన్సియర్ సినిమా..
ఎక్కడా కూడా ప్రేక్షకుడు కథని ఊహించలేని,అంచనా వేయలేని ఒక మంచి స్క్రీన్ ప్లే...
ఎక్కడా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా , కథలోనే ఉంటూ కథని కథలాగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు.

ఆల్ రెడీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన డైరెక్టర్సే ప్రయోగాలు చెయ్యడానికి ముందుకురావడం లేదు..
వాళ్ళకు ఇష్టం లేకపోయినా బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని కథకి అవసరం లేకపోయినా అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ ఉంటారు.
అలాంటిది ..కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతూ రెగ్యులర్ ఫార్ములాని పక్కన పెట్టేసి తాను నమ్మింది తీసిన డైరెక్టర్ నమ్మకానికి, గట్స్ కి మెచ్చుకోవాలి.

ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఒక లేడీ డైరెక్టర్.....శ్రీవిద్య బసవ.
తెలుగులో ఒక లేడీ డైరెక్టర్ తీసిన సినిమాలల్లో టెక్నికల్ గా ఇంత స్ట్రాంగ్ గా ఉన్న సినిమా నేనయితే చూడలేదు.
చాలా హార్డ్ వర్కర్….వెరీ పాషనేట్.....
సినిమాలో ఆవిడ చేసిన ప్రతీ సీన్ ......ప్రతీ షాట్ చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకుని తీసిందే అని చాలా స్పష్టంగా తెలిసిపోతుంది.
సౌండ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది.
"మను” సినిమా కి మ్యూజిక్ కంపోజ్ చేసిన నరేష్ కుమరన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు.
కెమెరా & ఎడిటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది.

ప్రేక్షకులకు ఈ సినిమాలో ఏదైనా ఎంతో కొంత మైనస్ కనపడుతుంది అంటే అది కేవలం కాస్టింగ్ మాత్రమే…
ఇది కేవలం డైరెక్టర్స్ మూవీ..
ఇందులో గుర్తుండిపోయే పర్ఫార్మెన్సెస్ కన్నా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఉన్నాయ్..
పర్ఫార్మెన్సెస్ గుర్తున్నాయ్ అంటే అది నటుడి గొప్పతనం..
క్యారెక్టర్స్ గుర్తున్నాయి అంటే అది రైటర్,డైరెక్టర్ గొప్పతనం.
ఒక్కోసారి క్యారెక్టర్ పెద్ద గొప్పగా లేకపోయినా యాక్టర్ తన ఇంప్రవైజేషన్ తో తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకునేలా చేయొచ్చు..
అది పూర్తిగా ఆ యాక్టర్ గొప్పతనం..
ఒక్కోసారి యాక్టర్ గొప్పగా పర్ఫార్మెన్స్ చేయకపోయినా ఆ క్యారెక్టర్ మనకి ఎప్పటికీ గుర్తుండుపోతుంది.
కారణం ఆ క్యారెక్టర్ అంత బాగా డిజైన్ చెయ్యబడి ఉండటం... అంత బలంగా ఉండటం.
అలాంటప్పుడు అది పూర్తిగా దాన్ని క్రియేట్ చేసిన ఆ రైటర్ అండ్ డైరెక్టర్ గొప్పతనం..
సో..ఇది ప్యూర్లీ డైరెక్టర్స్ మూవీ…
ఇది శ్రీవిద్య బసవ మూవీ…

"మహిళలను ప్రోత్సహించాలి...మహిళా దర్శకులని ఎంకరేజ్ చెయ్యాలి"అంటూ పెద్ద పెద్ద మాటలు నేను చెప్పలేను గానీ….
ఇదొక మంచి సినిమా….మంచి సినిమా ఎవరు చేసినా ఏ జెండర్ చేసినా చూద్దాం...ఎంకరేజ్ చేద్దాం.
మంచి సినిమాని ఎంకరేజ్ చేద్దాం.
ఆల్ ద బెస్ట్ శ్రీవిద్య బసవ..
మళ్ళీ ఒక మంచి సినిమాతో మాత్రమే కలుద్దాం…thank you.. - TNR

TNR Comment Link @ bit.ly/39LwruQ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp