TNR comment on "విరాటపర్వం టీజర్"

By TNR Mar. 19, 2021, 01:21 pm IST
TNR comment on "విరాటపర్వం టీజర్"

అద్భుతం...ఇంత గొప్ప టీజర్ చూసి చాలా కాలమైంది..
ఆ ప్రతీ విజువల్ లో మణిరత్నం సినిమాలో ఉన్న డెప్త్,ప్రతీ మాటలో సాహిత్యం మీద డైరెక్టర్ కి ఉన్న పట్టు కనపడుతోంది..
గతం లో నక్సల్ బ్యాక్ డ్రాప్ లో ఎన్ని సినిమాలు వచ్చి ఉన్నా ఆ బ్యాక్ డ్రాప్ కి అద్భుతమైన ప్రేమకథని లింక్ చెయ్యడం నిజంగా చాలా గొప్ప ఆలోచన..
ఏ డైరెక్టర్ కైనా గొప్ప థాట్స్ రావడం గొప్ప విషయం కానే కాదు..
ఆ థాట్ ని అంతే గొప్పగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చెయ్యడం మాత్రమే గొప్ప విషయం..
మనసులో వచ్చిన ఆ గొప్ప థాట్ ని అంతే గొప్పగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసినట్టనిపించింది ఈ టీజర్ విషయంలో..
మామూలుగా ఏ సినిమాకైనా థియేటర్ లో డైలాగ్స్ కి క్లాప్స్ పడటం,డాన్స్ స్టెప్స్ కి క్లాప్స్ పడటం లాంటివి సహజం..
కానీ చాలా రోజుల తర్వాత సినిమాలోని షాట్స్ కి క్లాప్స్ పడేలా ఉన్నాయ్ ఈ సినిమాలోని విజువల్స్..
ఆ విజువల్స్ కి మ్యూజిక్ కూడా అంతే గొప్పగా తోడయ్యింది..
టీజర్ లో నాకు బాగా నచ్చిన విజువల్ హీరోయిన్ సాయిపల్లవి ఆకులో డిజైన్ చేసి ఉన్న కమ్యూనిస్ట్ గుర్తుని గోడపై షాడోలో చూడటం..
నిజంగా ఆ థాట్ కే హాట్సాఫ్...
టీజర్ లో ఉన్న ప్రతీ దృశ్యంలో మనసుని ఆహ్లాదపర్చే భావం ఉంది..
ప్రతీ మాటలో హృదయాన్ని హత్తుకునే ఎమోషన్ ఉంది..
చాలా రోజుల తర్వాత ప్యాకేజ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ అనిపిస్తోంది..
నిజమైన థియేటర్ కిక్ ఫీలయ్యే సినిమాలా కనపడుతోంది..
ఈ టీజర్ రేంజ్ లోనే సినిమా కూడా ఉంటుందని,టీజర్ లో చూపించక దాచిపెట్టి ఉంచిన అద్భుతమైన విజువల్స్ & డైలాగ్స్ బోలెడన్ని ఉండిఉంటాయని,ఆడియన్స్ ని ఎట్టి పరిస్థితిలోనూ ఈ సినిమా నిరాశపర్చబోదని ఆశిస్తున్నాను...
ఆకలి మీదున్న డైరెక్టర్,ప్రేక్షకుల ఆకలి తెలిసిన డైరెక్టర్ చూపించిన కసిలా ఉంది ఈ టీజర్..
నీ ఆకలి ఎప్పటికీ తీరక,నీ కసిని ఎప్పటికీ ఇలాగే చూపించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ వేణు ఉడుగుల...
సినిమా విడుదలయ్యాక సినిమా కామెంట్ తో కలుద్దాం..
ఈగర్లీ వెయిటింగ్ ఫర్ "విరాటపర్వం" & ఎప్రిల్ 30th

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp