ఈ ముసలాయన చాదస్తం కాకపోతే అసలు ఇందులో ఏముందని చూడాలి.?- TNR

By TNR Feb. 22, 2020, 12:14 am IST
ఈ ముసలాయన చాదస్తం కాకపోతే అసలు ఇందులో ఏముందని చూడాలి.?- TNR

ఈ షార్ట్ ఫిల్మ్ లో భారీ సెట్లు లేవు...
భారీ తారాగణం లేదు...
ఒక్క LB.శ్రీరాం గారు తప్ప మిగతా వాళ్ళంతా నటనకి పెద్దగా పరిచయం లేని వ్యక్తులే...
అంతా కొత్త వాళ్ళతో చేశారు కాబట్టి LB గారిలో తప్ప ఈ ఫిల్మ్ లో పెద్ద పర్ఫార్మెన్సెస్ ఏం కనపడవు.
అందుబాటులో ఉండే వనరులతో తీసిన ఫిల్మ్ కాబట్టి గొప్ప మేకింగ్ కూడా ఏం లేదు.
ఇవేమీ లేనప్పుడు సమయం వృధా చేసుకుని ఈ ఫిల్మ్ ఎందుకు చూడాలి..?
ఎందుకంటే...పైవేమీ లేకున్నా ఇందులో ఉన్నదల్లా గొప్ప ఆత్మ...
ఒక గొప్ప కంటెంట్…
కథ మనింట్లో జరిగినట్టుంటుంది కాబట్టి భారీ సెట్లతో పనిలేదనిపిస్తుంది.
కథలో ఉన్నది మనింటి మనుషుల్లా అనిపిస్తారు కాబట్టి భారీ తారగణం అవసరం లేదనిపిస్తుంది.
కంటెంట్ లో విషయం ఉంది కాబట్టి అది పర్ఫార్మెన్సెస్ ని మర్చిపోయేలా చేస్తుంది.
ఆత్మ గొప్పగా ఉంది కాబట్టి అది మేకింగ్ ని పట్టించుకోకుండా చేస్తుంది.
ఈ ప్రకృతిని సృష్టించింది దేవుడైతే మన సృష్టికి కారణమైన నాన్న కూడా మనకు దేవుడే...
ఈ రోజు ఆ శివుడిని ఆరాధించడం తో పాటు ఈ దేవుడి మొర కూడా ఆలకిద్దాం....
ఈ శివరాత్రిరోజు విడుదలయిన ఈ "నాన్న డైరీ"ని తిలకిద్దాం...❤🙏

- TNR

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp