TNR comment on “జోహార్”

By TNR Aug. 13, 2020, 08:58 pm IST
TNR comment on “జోహార్”

చాలా రోజుల తర్వాత కామెంట్ తో ముందుకొస్తున్నాను..
ఈరోజు సినిమా “జోహార్”
ఈ సినిమాని నేను ఒకరోజు ముందే అడ్వాన్స్ గా చూడటం జరిగింది..
అందుకే ఈ అడ్వాన్స్ కామెంట్..

“జోహార్” ఇది ఒక జెన్యూన్ మూవీ…
సమాజాన్ని ఒక్కసారి ఆలోచనలో పడేసే మూవీ…
రాజకీయనాయకులకు సూటి ప్రశ్న ఈ మూవీ…
గతం లో ఈ సినిమా షూటింగ్ టైంలో నా ఫేస్ బుక్ పోస్ట్ లో చెప్పినట్టు ఈ సినిమా ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ స్థాయి సినిమానే…
ఇప్పుడు ఈ సినిమా చూశాక నా మాటలు నిజం అని ధైర్యంగా చెబుతున్నా.
బట్ ఒక OTT లో విడుదలయిన సినిమా నేషనల్ అవార్డ్ కి నోచుకుంటుందా అన్న విషయం లో నాకూ అనుమానాలే ఉన్నాయ్..
చూడాలి..

ఇక సినిమా విషయానికొస్తే…
అతి తక్కువ సినిమాలు పోస్టర్స్ తో ఆడియన్స్ లో ఒక మంచి ఇంప్రెషన్ ని క్రియేట్ చేసుకుంటాయ్...
అందులోనూ ఎటువంటి స్టార్ కాస్ట్ బలం పెద్దగాలేని చిన్న సినిమాలు అలా ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడం చాలా అవసరం..
అలాంటి ఇంప్రెషన్ ని పోస్టర్ తోనే క్రియేట్ చేసుకున్న సినిమా జోహార్.
టీజర్ తో ఇంకొంత ఇంప్రెషన్ ని ,ట్రెయిలర్ తో మరింత ఇంప్రెషన్ ని కలిగించుకుని ఇప్పుడు సినిమాతో ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలు ఏవీ తప్పు కాదు అని ప్రూవ్ చేసుకున్న సినిమా జోహార్.

చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం...సినిమా బిగినింగ్ లో ఒక మేజర్ సీన్ తో స్టార్ట్ చేసి ఆడియన్స్ ని హుక్ చేస్తాడు డైరెక్టర్...
తర్వాత మిగతా కథ అన్నది బిగినింగ్ లో వేసిన ఆ సీన్ కి సంబంధం లేకుండా నడుస్తుంది.
ఆ సీన్స్ ని ఎంజాయ్ చేస్తున్నా కూడా ప్రేక్షకుడికి సబ్ కాన్షియస్ మైండ్ లో ఎక్కడో రన్ అవుతూనే ఉంటుంది…..
అసలు ఈ కథని మొదట వేసిన సీన్ కి ఎలా కనెక్ట్ చేస్తాడా డైరెక్టర్ అని..
అది ఒక సక్సెస్ ఫుల్ ఫార్మూలా…..
కానీ క్లైమాక్స్ లో ఈ కథకి ఆ బిగినింగ్ పాయింట్ ని లాజిక్ మిస్ అవ్వకుండా లింక్ అప్ చేసి ఆడియన్స్ చేత వావ్ అనిపించుకున్నాడు అంటే ఆ సినిమా ఆ డైరెక్టర్ సక్సెస్ అయినట్టే…..
అలా ఈ సినిమా డైరెక్టర్ క్లైమాక్స్ లో వావ్ అనిపించుకుంటాడు.

ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది మనసుకు హత్తుకునే ప్లెజెంట్ విజువల్ ప్రెజెంటేషన్..
చాలా మంది అంటుంటారు…"ఈ సినిమాలో లొకేషన్స్ చాలా బాగున్నాయ్" అని...
కానీ నిజానికి లొకేషన్స్ బాగుంటే సరిపోదు...
పెట్టే బ్లాక్స్ అద్భుతంగా ఉండాలి...
డైరెక్టర్ కి ,కెమెరా మాన్ కి ఆ ఫ్రేం సెన్స్ బాగా లేకపోతే ఎంత అద్భుతమైన లొకేషన్ అయినా చాలా యావరేజ్ గా కనపడుతుంది….
ఫ్రేం సెన్స్ బాగుంటే యావరేజ్ లొకేషన్ కూడా అందంగా కనపడుతుంది..
అక్కడ బాగుంది దర్శకుడి ఫ్రేం సెన్స్ అండ్ విజన్ తప్ప ఆ లొకేషన్ కాదు..

ఈ సినిమా విషయానికొస్తే లొకేషన్స్ ని పరిపూర్ణంగా వాడుకోవడం అన్నది చాలారోజుల తర్వత ఈ సినిమాలో చూశాను.
అందమైన బ్లాక్ ని ఎక్కడా ఏ లొకేషన్ లోనూ వదులుకోలేదు డైరెక్టర్ అండ్ కెమెరామాన్..
ముఖ్యంగా వారణాసి ని అద్భుతంగా వాడుకున్నారు..
మీరు ఏ సీన్ అయినా తీసుకొండి...
ప్రతీ సీన్ లో ఏదో ఒక ఫ్రెష్ షాట్ కంపోజిషన్ ఉంటుంది..

ఇక సినిమాలోని పాత్రల గురించి మాట్లాడితే …
సినిమాలో ఉన్న పాత్ర యొక్క ప్రాబ్లం తన ప్రాబ్లం లాగా ఫీలయి ప్రేక్షకుడు ఎప్పుడయితే కనెక్ట్ అయిపోతాడో ఆ పాత్ర సృష్టి లో జీవం ఉందని,దాని డిజైనింగ్ కరెక్ట్ గా ఉందని ఆ పాత్ర లో ఉన్న నటుడి పర్ఫార్మెన్స్ అద్భుతమని అర్థం...
అలా ఈ సినిమాలోని ప్రతీ పాత్ర ప్రాబ్లం మన ప్రాబ్లం గా ఫీల్ అవుతాం...తల్లడిల్లిపోతాం…

ఉదాహరణకి...తుఫాను వచ్చినప్పుడు ఈశ్వరీ రావు తన కూతురితో కలిసి అర్ధరాత్రి లాంతరు తీసుకుని తన పొలాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతీ ప్రేక్షకుడి గుండె వేగం పెరగడం ఖాయం...
అక్కడ ఏం జరగబోతుందో ప్రతీ ప్రేక్షకుడికి తెలుసు..
ఊహించుకోగలడు..
ఊహించిన విషయాన్ని కూడా గుండె స్పీడ్ గా కొట్టుకునే విధంగా తీయడమన్నది కేవలం దర్శకుడి ప్రతిభ మాత్రమే…

ఇక తెల్లారి ఆవిడ పొలం నాశనమయిపోవడం చూసి గుండె బద్దలయ్యేలా ఏడవడం అన్నది ప్రతీ ప్రేక్షకుడి గుండె బద్దలయ్యేలా చేస్తుంది.
షూటింగ్ జరగక ముందు ఈ పాయింట్ ని స్క్రిప్ట్ గా చెప్పుకుంటే, లేదా సీన్ పేపర్ మీద చూసుకుంటే చాలా సింపుల్ గా అనిపించే పాయింట్..
ఎన్నో సినిమాల్లో చూసిన అతి సాధారణమైన సీన్..
కానీ ఆ సామాన్యమైన విషయాన్ని అసాధారణంగా తెరకెక్కించడమే కదా దర్శకుడి ప్రతిభ...
ఈ సీన్ మీకు ఉదాహరణగా మాత్రమే చెప్పాను..
అలాంటి ప్రతిభ మనకి చాలా సీన్స్ లొ ప్రతీ క్యారెక్టర్ డిజైనింగ్ లో కనపడుతుంది.

ఇందులో ఉన్న నటీనటుల గురించి చెప్పాలంటే..
ఇక్కడ నటీనటుల పేర్లు చెప్పడానికి ఇందులో పెద్దగా ఎవ్వరూ లేరు..
ఎందుకంటే ఇందులో నటీనటులు ఎవ్వరూ కనపడరుకాబట్టి..
పాత్రలు మాత్రమే కనపడతాయి కాబట్టి…
అత్లెట్ గా చేసిన నైనా గంగూలీ అయితేనేమి,లవర్స్ గా చేసిన ఆ అబ్బాయి అమ్మాయి అయితేనేమీ,తల్లీకూతుళ్ళుగా చేసిన శ్యామలా గౌరి & ఆ పాప అయితేనేమీ,అనాధ శరణాలయం నిర్వహిస్తున్న ముసలాయనగా చేసిన సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్ అయితేనేమీ....ఎవ్వరిలోనూ నటులు కనపడరు...
ఈ దర్శకుడి పాత్రలు మాత్రమే కనపడతాయి..
ఖచ్చితంగా ఆ క్రెడిట్ యాక్టర్స్ కంటే దర్శకుడికే పోతుంది…
శుభలేఖ సుధాకర్ గారు తన సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన క్యారెక్టర్స్ లో అత్యుత్తమ క్యారెక్టర్ ఖచ్చితంగా ఇదే,..

ఎంతో ప్రిపరేషన్ ఉంటే తప్ప ,ప్రీ ప్రొడక్షన్ లో ఎంతో వర్క్ చేస్తే తప్ప కథలో కానీ మేకింగ్ లో కానీ, పాత్రల డిజైనింగ్ లో కానీ ఈ క్లారిటీ ఉండదు.
అంత గొప్ప క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఈ సినిమా డైరెక్టర్ తేజ మర్ని

కొత్త డైరెక్టర్స్ తోఇండస్ట్రీ తీరు మారుతోంది...
వెంకటేష్ మహా,శైలేష్,ప్రశాంత్ వర్మ,సందీప్ రెడ్డి,గౌతం,వివేక్ ఆత్రేయ,తరుణ్ భాస్కర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు...
పెద్ద డైరెక్టర్లతో ఇలాంటి ప్రయోగాలు జరగడం ఆల్మోస్ట్ అసాధ్యమయిపోయింది...
మనం మళయాలం సినిమాలతో,హింది సినిమాలతో ,వరల్డ్ సినిమాలతో పోటీపడటం అన్నది ఇప్పుడొస్తున్న అప్ కమింగ్ దర్శకులతోనే సాధ్యమని రోజురోజుకూ ప్రూవ్ అవుతోంది...

ఈ మధ్య అనవసరపు అడల్ట్ కంటెంట్ వలన OTTలో ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు చూడలేకపోతున్నారు..
ఏమన్నా అంటే రియలిస్టిక్ ఎప్రోచ్ అనే మాట...
అందరూ కలిసి చూడతగ్గ ఇంత నీట్ సినిమాలో అవసరం లేని ఒక అడల్ట్ షాట్ పెట్టడం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది.
ఆ ఒక్క షాట్ సింబాలిక్ గా చూపించి ఉన్నా అంతే ఇంపాక్ట్ వచ్చి ఉండేది...
ఎక్కడా ఇంటెన్సిటీ మిస్ అయ్యేది కాదు.
అయినప్పటికీ డైరెక్టర్ ని ఆ సీన్ తీసేలా చేసిన ఆ శక్తులు ఏంటో అర్థం కాదు.
ఇత మంచి క్లీన్ సినిమాలో ఆ షాట్ 'బియ్యం లో రాయి".

డైలాగ్స్ బాగున్నాయ్...
"పేరు మార్చుకున్నంత ఈజీ కాదు సిద్ధాంతాలు మార్చుకోవడం" లాంటి డైలాగ్స్ చాలా బాగున్నాయ్.

సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది..
పాటలు అర్థవంతంగా ఉన్నాయ్..

కెమెరా వర్క్ చాలా చాలా బాగుంది..
ఈ విజువల్ ఫీస్ట్ ని పెద్ద తెర మీద చూడలేకపోవడం మన దురదృష్టం..

ఈనెల 14న “aha"లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా 13th మిడ్ నైట్ వరకు వెయిట్ చూసే అంత వర్త్ వెయిటింగ్..

ఈ సినిమా కథ నేను రివీల్ చెయ్యనుగానీ ఈ సినిమా ప్రస్తుత రాజకీయనాయకులందరికీ చేరాలని కోరుకుంటున్నాను..
ముఖ్యంగా మన ముఖ్యమంత్రులు YSR,KCR & మాజీ ముఖ్యమంత్రి CBN లకు వీలయితే ప్రైం మినిస్టర్ దాకా ఖచ్చితంగా చేరాలని కోరుకుంటున్నాను.
ఈ సినిమా వలన ఒక్క రాజకీయ నాయకుడి ఆలోచనలో మార్పు వచ్చినా ఈ సినిమాకి ఒక సార్ధకత ఏర్పడ్డట్టే...ఈ దర్శకుడి ప్రయత్నం ఫలించినట్టే..

ఇక చివరిగా గూగుల్ లో ఈ సినిమా గురించి "జోహార్" అని సెర్చ్ చేస్తుంటే కరణ్ జోహార్ గురించి వస్తోంది..
ఇది రిలీజ్ కి ముందు...
రిలీజ్ అయ్యాక "కరణ్ జోహార్" గురించి సెర్చ్ చేసినా ఈ “జోహార్" సినిమా డీటెయిల్సే వస్తాయని,రావాలని ఆ స్థాయికి ఈ సినిమా వెళ్తుందని వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి సినిమాతో మనసుకు హత్తుకుపోయే సినిమాతో మాత్రమే కలుద్దాం...

సీ యూ .. - TNR

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp