TNR comment on "బుట్టబొమ్మ సాంగ్"

By TNR Jan. 14, 2020, 08:50 pm IST
TNR comment on "బుట్టబొమ్మ సాంగ్"
"మల్టిప్లెక్స్ లోని ఆడియన్స్ లాగ మౌనంగున్నగానీ అమ్ము,
లోన డండనక జరిగిందే నమ్ము"
"అల వైకుంఠ పురములో" సినిమాలోని 'బుట్టబొమ్మ' సాంగ్ లో ఈ లిరిక్స్ విన్న ప్రతీసారీ నా పెదాలపై నవ్వు వస్తూనే ఉంటుంది.
కేవలం ఆ లైన్స్ కోసం నేను రిపీటెడ్ గా విన్న సందర్భాలు ఉన్నాయ్.
వినడానికి అవి మామూలు లైన్స్ గా అనిపించినప్పటికీ మంచి చమత్కారం ఉంది అందులో..
జీవిత సత్యం ఉంది.
ముఖ్యంగా సినిమా వాళ్ళకి ఆ లైన్ బాగా కిక్కిస్తుంది.
గొప్ప సాహిత్యం అంటే ఆడియన్స్ కి అర్థం కాని పదాలను అలవోకగా వాడటం మాత్రమే కాదు,అతి సులువుగా ,అర్థమయ్యే రీతిలో వాడుక భాషలో వాడే వాక్యాలు కూడా.
అలా అతి సులువుగా గొప్పగా వాడబడిన సాహిత్యం ఈ "బుట్టబొమ్మ" సాంగ్.
ఈ పాట నేను రోజూ వింటూ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ ఈ పాట ఎవరు రాశారు అన్న దానిమీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదు.
నిన్న ఒక లాంగ్ డ్రైవ్ కి వెళ్తూ ఈ పాట మళ్ళీ వింటూంటే అసలు ఈ పాట ఎవరు రాశారు అనే కుతూహలం వచ్చి "ఈ పాట ఎవరూ రాశారో చూడరా?" అని వెనక సీట్లో కూచున్న నా పాపని అడిగాను.
వెంటనే దాని చిట్టివేళ్ళతో గూగుల్ సెర్చ్ చేసి "రామజోగయ్య శాస్త్రి అంట నాన్నా" అని చెప్పింది.
ఓ సూపర్బ్ అనుకున్నా...
చాలా యూత్ ఫుల్ గా ఆ పాట రాశారు.
ఒక రచయిత తన వయసుతో సంబంధం లేకుండా ఏ వయసుకయినా దిగగలిగి,ఎక్కగలిగి ఏ సందర్భానికైనా పాట రాయగలిగినప్పుడే ఆయన నిజమైన రచయిత...
అలా నిజమైన రచయిత అని ప్రతీసారీ నిరూపించుకునే అవకాశం వాళ్ళను వాడుకున్న దర్శకులని బట్టి,మ్యూజిక్ డైరెక్టర్స్ ని బట్టి కూడా ఉంటుంది.
రామజోగయ్య శాస్త్రి గారి గురించి నేను కొత్తగా ఈరోజు చెప్పాల్సింది ఏం లేదు...
అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ ఓ రెండు మాటలు ఆయన గురించి ప్రస్తావించాలనే ప్రయత్నం మాత్రమే ఇది.
లోన ఎన్నో డండనకలు జరిగి ఉంటే తప్ప ఆయన ఈ రేంజ్ రచయిత అయి ఉండరు.
కీప్ రాకింగ్ రామజోగయ్య శాస్త్రి గారూ..
ఇక పోతే ఈ పాట కి సంగీతం ,సాహిత్యం,కొరియోగ్రఫీ,కాస్ట్యూంస్,సెట్ డిజైన్,కెమెరా ఇవన్నీ ఎంత గొప్పగా ఉన్నాయో...అల్లు అర్జున్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మూమెంట్స్ కూడా అంతకన్నా గొప్పగా ఉన్నాయ్.
ముఖ్యంగా పైన నేను చెప్పిన ఆ లైన్స్ కి అల్లు అర్జున్ ఎక్స్ ప్రెషన్ చూడండి.
ఈ లైన్స్ విన్నప్పుడు ఎంత నవ్వుకున్నానో ఆ లైన్స్ కి అల్లు అర్జున్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూసి అంతకన్నా ఎక్కువ నవ్వుకున్నా..
కావాలంటే సినిమా చూసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి.
ఏది ఏమైనా...అన్ని డిపార్ట్మెంట్స్ సరిసమానంగా తమ ప్రతిభని ప్రదర్శిస్తే ఆ పాట ఏ రేంజ్ లో జనాల్లోకి వెళ్తుందనే దానికి “ "బుట్టబొమ్మ" మరొక ఉదాహరణ.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp