TNR comment on " భీష్మ"

By TNR Feb. 21, 2020, 10:26 pm IST
TNR comment on " భీష్మ"

ఈవారం ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చెయ్యగలిగే సినిమా.
ఈ సినిమా బాగుంది…….. కానీ
డైరెక్టర్ వెంకీ కుడుముల గతం లో చేసిన “చలో" సినిమాలో ఒక ఒరిజినాలిటీ ఉంటుంది.
బట్ ఈ సినిమాలో వేరే సినిమాల ఇంఫ్లూయెన్స్ కనపడుతుంది.
కథ చెప్పే విధానం లో,మూవీ మేకింగ్ లో తెలియకుండానే ఎక్కడో త్రివిక్రం స్టయిల్ కనపడుతుంది.
భీష్మ - directed by thrivikram అని టైటిల్ వేసినా ఆడియన్స్ ఎడ్జెస్ట్ అయిపోయి నమ్మేట్టుగా ఉంది.

సినిమా కథలోని బేసిక్ పాయింట్ లో ప్రతీ ఆడియన్స్ కి ఖచ్చితంగా మహర్షి సినిమా గుర్తుకొస్తుంది.
ఈమధ్య ఎందుకో మన డైరెక్టర్స్ కళ్ళు వ్యవసాయం మీదా,ఆర్గానికి ఫుడ్ మీద పడ్డాయ్.
మొన్న మహర్షి,ఈరోజు ఈ భీష్మ,త్వరలో రాబోయే శర్వానంద్ శ్రీకారం.

ఇక కథ విషయానికొస్తే కథ అక్కడక్కడా కొంచెం ఫోర్స్ గా డ్రైవ్ చెయ్యబడుతుంది.
సినిమాటిక్ ఫ్రీడం కొంచెం ఎక్కువగానే కనపడుతుంది.

ఉదాహరణకి హీరోయిన్ ఫాదర్ హీరోని తన ఇంట్లో పెట్టుకునే కారణం,
తర్వాత ఆ క్యారెక్టర్ తో చేసిన డ్రైవ్ కొంచెం ఫోర్స్ గానే ఉంటుంది.
పర్లేదులే ఈమాత్రం సినిమాటిక్ ఫ్రీడం తప్పులేదులే అనుకునే ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చెయ్యొచ్చు.

డైలాగ్స్ బాగున్నాయ్..
ఉదాహరణకి "రోడ్డు మీద జులాయిగా తిరిగే ప్రతీవాడు పనికిరానివాడు అనుకోవొద్దు సర్ మనం చూసే విధానంలోనే ఏదైనా ఉంటుంది సర్" అని హీరోయిన్ ఫాదర్ తో హీరో స్కూల్ బెల్ ఎగ్సాంపుల్ చెప్పడం బాగుంది.

"అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడటానికి ఏదో అద్భుతం జరగక్కర్లేదు.
అతని మీద అభిప్రాయం ఏర్పడితే చాలు.
అలాంటి అభిప్రాయం నాకు నీమీద నిన్ను చూడక ముందే కలిగింది"...లాంటి డైలాగ్స్ బాగున్నాయ్.

మార్నింగ్ 2ఎగ్స్,
ఈవినింగ్ 2పెగ్స్,
నైట్ 2లెగ్స్ లాంటి మాస్ డైలాగ్స్ మనం మన పక్కసీటోడికి వినిపించకుండా లోలోపలే ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయ్.
మంచి సీన్స్ చెప్పుకోడానికి చాలానే ఉన్నాయ్.

ఉదాహరణకి హీరోయిన్ ఫాదర్ & హీరో మధ్యలో ఉండే రొమాంటిక్ వీడియో కాల్ హిలేరియస్ గా ఉంటుంది.
థియేటర్ అంతా నవ్వడం ఖాయం.
అలాగే..అజయ్,హెబ్బా పటేల్ మధ్య హోటల్ రూం సీన్ హిలేరియస్ గా ఉంటుంది.

కొన్ని కామెడీ బిట్స్ అక్కడక్కడా పేలలేదు.
ఉదాహరణకి ఒక కామెడీసీన్ కి బ్యాక్ గ్రౌండ్ లో వేసిన "గాలివానలో" సాంగ్
అస్సలు పేలలేదు....
ఆ సాంగ్ కి ఎవరికీ పెద్దగా నవ్వు రాలేదు.
ఆల్మోస్ట్ అపహాస్యం అయినట్టుగానే ఉంటుంది.
ఆ బిట్ తీసెయ్యడం సినిమా ఫ్లో కి హెల్ప్ అవుతుందేమో..

“చలో" సినిమాలోని ఒక్క సాంగ్ ఆ సినిమా భారీ ఓపెనింగ్స్ కి ముఖ్య కారణమయింది.
అలాంటి మ్యాజిక్ ఈ సినిమాకి జరగలేదు.
పాటలు కొంచెం యావరేజ్ గానే ఉన్నాయ్.

ఆడియోలో ఉన్న"హై క్లాసునుంచీ లో క్లాసుదాకా నా క్రషులే" అనే సాంగ్ లో 'మెంటలే' అనే పదం సినిమాలో మాత్రం మ్యూట్ అయింది.
అది సెన్సార్ వాళ్ళ పనే అయితే గనక అది అర్థం లేని కట్.
వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటో ఒక్కోసారి నిజంగా అర్థం కావు.

ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే...
చాలా రోజుల తర్వాత రఘుబాబు ఇందులో చాలా ప్రాముఖ్యమైన క్యారెక్టర్ వేశాడు.
చాలా చోట్ల ఆయన పంచెస్ క్లిక్ అయ్యాయ్.
రఘుబాబుకి ఇది మళ్ళీ ఒక మంచి బ్రేక్ అని చెప్పాలి.
అతని కాంబినేషన్ లో వెన్నెల కిషోర్ కామెడీ యాజువ్యూజువల్ గా బాగుంది.

నితిన్ గత సినిమాలతో పోలిస్తే ఖచ్చితంగా బెట్టర్ పర్ఫార్మెన్స్...
తన గత సినిమాల్లో నితిన్ డైలాగ్స్ అక్కడక్కడా రోల్ అవుతుంటాయ్..
బట్ ఇందులో డిక్షన్ చాలా బెట్టరయింది…. బాగుంది.
యాక్టింగ్ లో మునుపటి సినిమాలతో పోలిస్తే ఈజ్ ఇంప్రూవ్ అయింది.
ఇంక రష్మిక తన రెగ్యులర్ పర్ఫార్మెన్స్ తో బానే ఉంది.
అనంత్ నాగ్ క్యారెక్టర్ ఫ్రెష్ గా ఉంది.
అశ్వత్థామ లో విలన్ గా చేసిన జిషు సేన్ ఈ సినిమాలో కూడా స్టయిలిష్ గా బాగా పర్ఫార్మ్ చేశారు.

ఓవరాల్ గా ఈ వీకెండ్ కి ఒక మంచి ఎంటర్టెయినర్ భీష్మ...
మళ్ళీ TNR కామెంట్ లో ఒక మంచి సినిమాతో మాత్రమే కలుద్దాం..

సీ యూ.. - TNR

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp