ఈ 2 సినిమాలకు ఇదే మంచి ఛాన్స్

By iDream Post Jan. 20, 2021, 05:30 pm IST
ఈ 2 సినిమాలకు ఇదే మంచి ఛాన్స్

థియేటర్లు తెరుచుకున్నాయి. సగం కెపాసిటీతో అయినా సరే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు వచ్చిన వసూళ్లు చూసి పిచ్చ హ్యాపీగా ఉన్నారు. క్రాక్ ఏకంగా 20 కోట్ల మార్కు దాటేయగా రెడ్ పదిహేను కోట్లకు దగ్గరలో ఉంది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న మాస్టర్ సైతం పది కోట్ల దాకా రాబట్టి ఔరా అనిపించాడు. ఎటొచ్చి అల్లుడు అదుర్స్ పరిస్థితే తేడాగా ఉంది. తెగ హడావిడి చేస్తూ భారీ ఖర్చుతో ఈవెంట్లు చేస్తున్నా సరే అసలు సినిమాలో మ్యాటర్ లేదని గుర్తించిన జనాలు పండగ మరుసటి రోజు నుంచే దీనివైపు చూడటం తగ్గించేశారు. ఇంకో వారం దాకా ఈ ఫెస్టివల్ మూవీస్ హడావిడి కొనసాగడం ఖాయమనే చెప్పొచ్చు.

ఇక ఈ శుక్రవారం అల్లరి నరేష్ బంగారు బుల్లోడు ఒక్కటే సోలోగా బరిలో దిగనుంది. ఆపై 29న రెండు సినిమాలు రాబోతున్నాయి. ఒక సుమంత్ కపటధారి కాగా రెండోది యాంకర్ ప్రదీప్ మాచిరాజూ డెబ్యూ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు విడుదల విషయంలో చాలా ఆలస్యాన్ని ఎదుర్కొన్నా ఫైనల్ గా సరైన సమయంలోనే వస్తున్నాయి. ఎందుకంటే సంక్రాంతి సినిమాల హడావిడి అప్పటిదాకా ఉండదు. అందులోనూ వాటి డిజిటల్ ప్రీమియర్ డేట్లు కూడా బయటికి వస్తున్నాయి కాబట్టి అంత లేట్ గా థియేటర్లోనే చూసే జనం పెద్దగా ఉండకపోవచ్చు.

ఇప్పుడీ అవకాశాన్ని సరిగ్గా వాడుకునే కపటధారి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలాకు మంచి వసూళ్లు దక్కే ఛాన్స్ ఉంది. ఎలాగూ సుమంత్ మూవీ కన్నడలో ప్రూవ్ అయిన బ్లాక్ బస్టర్. ఒరిజినల్ వెర్షన్ దర్శకుడే తెలుగులోనూ తీశాడు కాబట్టి ఫలితం మీద నిర్మాతలు చాలా ధీమాగా ఉన్నారు. క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ ఇందులో అన్ని అంశాలు ఉంటాయి. ఇక ఒకే ఒక్క పాటతో అందరి దృష్ఠి తనమీద మళ్లేలా చేసుకున్న ప్రదీప్ చిత్రం కూడా ఓపెనింగ్స్ గురించి ధీమాగా ఉంది. మొత్తానికి సంక్రాంతి పండగ తర్వాత కూడా టాలీవుడ్ జోరు తగ్గేలా కనిపించడం లేదు. సమ్మర్ దాకా ఇదే దూకుడుతో థియేటర్లు కళకళలాడటం ఖాయం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp