బ్యాచిలర్ లో మరో బ్యూటీ సర్ప్రైజ్

By iDream Post Dec. 02, 2020, 11:56 am IST
బ్యాచిలర్ లో మరో బ్యూటీ సర్ప్రైజ్

ఐదేళ్ల నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మీద అభిమానులు ఏ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారో వేరే చెప్పనక్కర్లేదు. ఫామ్ లో లేని బొమ్మరిల్లు భాస్కర్ దీనికి దర్శకుడు కావడం టెన్షన్ పెడుతున్నా నిర్మాత అల్లు అరవింద్ జడ్జ్ మెంట్ మీద నమ్మకమే వీళ్లకు ఎక్కువగా ఉంది. అందులోనూ టాప్ ఫామ్ లో ఉన్న పూజా హెగ్డే హీరోయిన్ కావడం, తన ట్రాక్ రికార్డు గత మూడేళ్లుగా దేదీప్యమానంగా ఉండటం లాంటి కారణాలు పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. అయితే ప్రమోషన్స్ విషయంలో ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించే పబ్లిసిటీ ఇంతవరకు చేయని మాట వాస్తవం.

ఇప్పటిదాకా హీరోయిన్ ఒక్క పూజా హెగ్డేను ఉందనుకుంటున్నాం కానీ ఇందులో మరో బ్యూటీ కూడా ఉందట. తనే నేహా శెట్టి. తన కొడుకు ఆకాష్ తో పూరి జగన్నాధ్ తీసిన మెహబూబాతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. అయితే అది డిజాస్టర్ కావడంతో తనను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందులో బాగానే కష్టపడినప్పటికీ తగినంత గుర్తింపు రాలేదు. అందుకే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉందట. మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డేనే అయినప్పటికీ తన పాత్రకు కూడా స్కోప్ బాగానే ఉందట. విడిగా తనకు అఖిల్ కు మధ్య ఓ లవ్ ఎపిసోడ్ కూడా ఉంటుందని ఇన్ సైడ్ టాక్.

2021 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేసుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇంకా డేట్ ని అనౌన్స్ చేయలేదు. ఇంకొన్ని చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అవెలాగూ ఈ నెలలో పూర్తయిపోతాయి. ఒకవేళ జనవరికంతా ఇప్పుడున్న పరిస్థితిలో మార్పు వచ్చి థియేటర్లు కళకళలాడుతుంటే బ్యాచిలర్ ని పెద్ద తెరపై చూసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా యాభై శాతం సీట్ల లాంటి నిబంధనలు కొనసాగాయి అంటే మాత్రం మళ్ళీ వేచి చూసే స్ట్రాటజీకే మొగ్గు చూపొచ్చు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp