థాంక్ యు చెప్పనున్న చైతు జోడి

By iDream Post Jul. 02, 2020, 02:41 pm IST
థాంక్ యు చెప్పనున్న చైతు జోడి

గత ఏడాది మజిలీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని లవ్ స్టోరీ విడుదల కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్య మనం, హలో ఫేమ్ విక్రమ్ కుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. దర్శకుడూ ఇదే హింట్ ఇస్తూ ఈ మధ్య ఇంటర్వ్యూలలో మాట్లాడ్డంతో ఖరారైనట్టు అర్థమైపోయింది. తాజా అప్ డేట్ ప్రకారం దీనికి 'థాంక్ యు' అనే టైటిల్ ఫిక్స్ చేశారట. ఇందులో మరో విశేషం మిసెస్ సమంతా అక్కినేని హీరోయిన్ గా నటించడం. ఈ ఇద్దరి కాంబోలోని సెంటిమెంట్ సక్సెస్ మేజిక్ ని మరో రిపీట్ చేయబోతున్నారన్న మాట. విక్రమ్ కుమార్ గ్యాంగ్ లీడర్ తో ఏదో ప్రయోగం లాంటిది చేయబోయాడు కానీ అది ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడంతో ఈసారి పూర్తిగా ఎమోషనల్ టచ్ ఉన్న స్టోరీ ఎంచుకున్నాడట.

అందుకే చైతు-సామ్ ల జోడి కోరిమరీ ఒప్పించినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నాగ చైతన్య ఇంకొద్ది రోజులు షూటింగ్ లో పాల్గొంటే లవ్ స్టోరీ పూర్తవుతుంది. ఇప్పటిదాకా జరిగిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు డబ్బింగ్ కూడా చేస్తున్నారు. హైదరాబాద్ లో కరోనా ఇంకా అదుపులోకి రాకపోవడంతో యూనిట్ ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రంపై యూత్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది అవ్వగానే చైతు థాంక్ యు పాల్గొనొచ్చు. ఇది కాకుండా సోగ్గాడే చిన్ని నాయనలో నాన్న నాగార్జునతో పాటు చైతన్య నటించాల్సి ఉంది.

స్క్రిప్ట్ ఎప్పుడో సిద్ధమైనా ప్రకటన విషయంలో ఎందుకో నెలల తరబడి ఆలస్యం జరుగుతూనే ఉంది. ఒకవేళ లాక్ డౌన్ రాకపోయి ఉంటే వైల్డ్ డాగ్ అవ్వగానే నాగ్ దీన్నే ఫిక్స్ చేసేవారు. ఇప్పుడు చూస్తేనేమో ప్రవీణ్ సత్తారు పేరు వినిపిస్తోంది. మొత్తానికి బంగార్రాజు ఇంకొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నాడు. మజిలీ తర్వాత ఏ సినిమా ఒప్పుకోకుండా వెయిటింగ్ లో ఉన్న సామ్ ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తప్ప ఇంక దేనికీ కమిట్ కాలేదు. ఆఫర్స్ వస్తున్నా చాలామటుకు హోల్డ్ లో పెట్టడమో లేదా నో చెప్పడమో జరుగుతోందట. మనంతో మేజిక్ చేసిన విక్రమ్ కుమార్ మరి ఇప్పుడీ థాంక్ యుతో మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తారేమో చూడాలి. అఫీషియల్ ప్రకటన అంతా సద్దుమణిగాక వచ్చే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp