అరుదైన ఘనత తమన్ సొంతం

By iDream Post Jul. 11, 2020, 08:10 pm IST
అరుదైన ఘనత తమన్ సొంతం

ఇప్పుడున్న వర్తమాన సంగీత దర్శకుల్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే మొదట వినిపించే పేరు తమన్. ఈ ఏడాది అల వైకుంఠపురములో యుట్యూబ్ లో సృష్టించిన రికార్డులు చూసి అందరికీ మతులు పోయాయి. దేశ విదేశాల్లో బుట్టబొమ్మ రేపిన సంచలనం గురించి వేరే చెప్పాలా. ఇప్పటిదాకా తెలుగు, తమిళం, హిందికి పరిమితమైన తమన్ తాజాగా మలయాళంలోకి అడుగు పెట్టాడు. ఇందులో విశేషం ఏంటి అనుకోకండి. ఇప్పటిదాకా అందరికీ ఇది సాధ్యం కాలేదు. ఏఆర్ రెహమాన్ కెరీర్ ప్రారంభంలో మోహన్ లాల్ యోధకు సంగీతం అందించగా మళ్ళీ స్ట్రెయిట్ గా ఇంకో మూవీ చేయలేదు.

ఇళయరాజా మమ్ముట్టి లాంటి సీనియర్ హీరోలకు మ్యూజిక్ ఇచ్చారు. మణిశర్మ తమిళ్ లో సత్తా చాటినా కేరళలో అడుగు పెట్టలేకపోయారు. రాజ్ కోటి, కీరవాణి సైతం డబ్బింగ్ సినిమాల ద్వారానే తప్ప నేరుగా అక్కడి వాళ్ళకు పరిచయం లేదు. అలా చూసుకుంటే తమన్ కు ఇది అరుదైన గౌరవం గుర్తింపుగా చెప్పుకోవచ్చు. ఇక్కడే ఇంత డిమాండ్ ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలకు ఎందుకంటారా. తెలుగువాడి సత్తా అక్కడా చాటాలి కదా. ఇక తమన్ చేయబోయే సినిమా విషయానికి వస్తే దాని పేరు కడువా. పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా రూపొందుతుంది. మరో విశేషం ఏంటంటే సుప్రసిద్ధ దర్శకులు షాజీ కైలాష్ చాలా గ్యాప్ తర్వాత డైరెక్షన్ చేస్తున్న మూవీ ఇది. అతి త్వరలోనే దీని షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు.

90వ దశకంలో బ్లాక్ బస్టర్ యాక్షన్ డబ్బింగ్ సినిమాల ద్వారా షాజీ కైలాస్ మనవాళ్లకూ సుపరిచితుడే. అందుకే అక్కడ దీని మీద చాలా అంచనాలు నెలకొన్నాయి. తమన్ కనక దీంతో కూడా బ్లాక్ బస్టర్ కొడితే అక్కడా నిర్మాతలు వెంటపడతారు. ఇటీవలే సెన్సిబుల్ సినిమాలు బాగా ఆదరణ పొందుతున్న నేపథ్యంలో కడువా మంచి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. అడవి బ్యాక్ డ్రాప్ లో పృథ్విరాజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. స్టార్ హీరో ప్రాజెక్ట్ కాబట్టి తమన్ సైతం బెస్ట్ ఇచ్చేందుకే ప్రయత్నిస్తాడు. కడువాని తెలుగులో డబ్ చేస్తారో లేక పృథ్విరాజ్ డైరెక్ట్ చేసిన లూసిఫర్ తరహాలో ఎవరైనా రీమేక్ కోసం ముందుకు వస్తారో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp