పక్క చూపులు తగ్గిస్తే మంచిది

Follow us:
Follow @iDreamPost
ఇప్పుడు టాలీవుడ్ లో ఒకరకమైన స్లంప్ కొనసాగుతోంది . సంక్రాంతికి రెండు బ్లాక్ బస్టర్స్ వచ్చాయన్న ఆనందం ఆవిరయ్యేలా ఏకంగా ఐదు డిజాస్టర్లు వారానికి ఒకటి చొప్పున పలకరించడంతో ట్రేడ్ పరంగా నెగటివ్ ఎఫెక్ట్ చాలా ఉంది. ఎంత మంచివాడవురా, డిస్కో రాజా, అశ్వద్ధామ, జాను, వరల్డ్ ఫేమస్ లవర్ ఇవన్ని ఆయా హీరోలకు తగ్గట్టు క్రేజీ ఆఫర్లతో బయ్యర్లు పెట్టుబడి పెట్టిన సినిమాలు. కాని ఏది కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కాలేకపోయాయి. నష్టాలు తప్పించుకోకుండా ఏదీ బయట పడలేదు. ఆఖరికి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో యాభై రోజులు ఎక్కువ కేంద్రాల్లో నమోదు చేసుకోబోతుండడానికి కారణం ఇదే.
ఈ పోకడ గమనిస్తే మనవాళ్ళకు పక్క చూపులు ఎక్కువయ్యాయి. అంటే ఇతర రాష్ట్రాల్లో డబ్బింగ్ రూపంలోనో లేదా మల్టీ లాంగ్వేజ్ లోనో సినిమాలు వదిలి కాస్త ఎక్కువ డబ్బు చేసుకుందామనే ఆలోచన ఎక్కువ ఫలితాలను ఇవ్వడం లేదు. విజయ్ దేవరకొండ ఇప్పటికే ఈ విషయంలో మూడు సార్లు దెబ్బ తిన్నాడు. నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తెలుగుతో సహా అన్ని వెర్షన్లు బోల్తా కొట్టాయి. చిరంజీవి సైరా ఇక్కడే ఓ మాదిరిగా పర్వాలేదు అనిపిస్తే కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల్లో దారుణంగా దెబ్బ తింది,. అక్కడ రిలీజ్ చేయకపోతే బాగుండేది అని ఫ్యాన్స్ సైతం అనుకున్నారు.
సాహో ఒక్కటే హింది వెర్షన్ వరకు వర్క్ అవుట్ చేసుకోగా తమిళ్, కన్నడ, మలయాళంలో కనీసం ఇన్వెస్ట్ మెంట్ కూడా తీసుకురాలేదు. ఇలాంటి సినిమాల నిర్మాతల ధోరణి చూస్తుంటే పాన్ ఇండియా లెవెల్ అని చెప్పుకుంటూ ఏదేదో ఊహించుకుంటూ లేని మార్కెట్ ని భూతద్దంలో చూపిస్తూ సొమ్ములు చేసుకోవాలనే ఆత్రం తప్ప దీని వల్ల ఒరుగుతున్న ప్రయోజనం శూన్యం, మరొక్క విషయం ఉంది. ఏదైనా బాషలో సినిమా హిట్ అయితే చాలు దాని రీమేక్ హక్కుల కోసం ఎగబడకుండా మన ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అనే విశ్లేషణ కూడా చాలా అవసరమని జాను నేర్పించింది. మొత్తానికి మనవాళ్ళు ఇకపై ఇలా పక్క చూపులు ఆపేసి తెలుగు ఆడియన్స్ ని మెప్పించేందుకు ఎలాంటి కంటెంట్ కావాలో దాని మీద దృష్టి పెడితే ఇలాంటి ఫ్లాపుల పరంపరను తగ్గించుకోవచ్చు.


Click Here and join us to get our latest updates through WhatsApp