కెమెరా ఆన్ అయ్యింది - ఇక ప్రొజెక్టరే బాకీ

By iDream Post Jul. 13, 2021, 01:50 pm IST
కెమెరా ఆన్ అయ్యింది - ఇక ప్రొజెక్టరే బాకీ

టాలీవుడ్ కు మునుపటి కళ మెల్లగా వస్తోంది. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఇంట్లోనే మూడు నెలలు ఉన్న ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, ఇరవై నాలుగు విభాగాల కార్మికులు అందరూ స్టూడియోలకు, అవుట్ డోర్లకు వచ్చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా సందడే సందడి. బాలకృష అఖండ, మహేష్ బాబు సర్కారు వారి పాట, రామ్-లింగుస్వామిల సినిమా, నాగ శౌర్య కొత్త మూవీ అన్నీ ఒకేసారి సెట్లలో అడుగు పెట్టడం పట్ల పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వంద రోజులకు పైగా ఉపాధి లేక అల్లాడిన వర్కర్స్ ఇకపై పని కొనసాగుతుందన్న ధీమాతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సో మూలానపడిన కెమెరాలు స్విచ్ ఆన్ అయ్యాయి. ఇక మిగిలింది ప్రొజెక్టర్లే, ఈ నెల 23 నుంచి థియేటర్లు తెరవబోతున్నారనే వార్తలు వస్తున్నాయి కానీ ఒకటి ఆరా చోట్ల తప్ప ఇంకెక్కడా కనీసం వాటి తాలూకు సూచనలు కానీ ప్రకటనలు కానీ ప్రస్తుతానికి లేవు. ఆ తేదీకి నరసింహపురం అనే చిన్న సినిమా షెడ్యూల్ చేశారు కానీ దానికి ఏ మాత్రం జనం వస్తారు, ఓపెనింగ్స్ ఇస్తారనేది అనుమానమే. జూలై చివరి వారం దాకా వేచి చూడాలని ఎగ్జిబిటర్లు ముందే ఫిక్స్ చేసినట్టు వినిపిస్తోంది కానీ దానికి సంబంధించిన క్లారిటీ మిస్ అవుతోంది. తిమ్మరుసు జులై 30, ఎస్ఆర్ కల్యాణమండపం ఆగస్ట్ 6 ఇప్పటిదాకా అఫీషియల్ గా ఫిక్స్ అయిన డేట్లు.

దారుణ సంక్షోభం నుంచి వీలైనంత త్వరగా ఇండస్ట్రీ బయట పడాల్సిన అవసరం చాలా ఉంది. కరోనా థర్డ్ వేవ్ వస్తుందా లేదా అనేది పట్టించుకోకుండా ముందైతే కార్యకలాపాలు మొదలుపెట్టాలి. అన్ని వ్యాపారాలు మెల్లగా యధాస్థితికి వస్తున్నాయి. ఇక థియేటర్ వ్యవస్థ గాడిన పడటం కావాల్సి ఉంది. స్టార్ హీరోల భారీ సినిమాలు సైతం ఓటిటి బాట పట్టడం పట్ల ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతోంది. వీలైనంత త్వరగా థియేటర్ల గేట్లు తెరిచి వరసగా చిత్రాలను విడుదల చేస్తే తప్ప రాబోయే ఇబ్బందులను ఆపడం కష్టం. సో ఎప్పుడెప్పుడు ప్రొజెక్టర్ లైట్లు వెలుగుతాయా అని ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ కు ఆ ముహూర్తం దగ్గరలో ఉన్నట్టే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp