ఇటు అల్లుడు అటు మచ్చి ఇద్దరూ మౌనంగానే

ఇంకా థియేటర్లు తెరవకపోయినా మెల్లగా కొత్త సినిమాల సందడి దసరా నుంచే మొదలైంది. ప్రకటనలతోనే హోరెత్తిస్తున్నారు. అందరూ సంక్రాంతి అంటున్నారు కానీ ఖచ్చితంగా ఏ తేదీ అనే క్లారిటీ సదరు నిర్మాతల దగ్గరే లేదు. అయితే షూటింగులు పూర్తి చేసుకున్న రెండు సినిమాలు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మౌనాన్ని ఆశ్రయిస్తున్నాయి. ఒకటి అల్లుడు అదుర్స్. రెండు సూపర్ మచ్చి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ లాక్ డౌన్ అయ్యాక బాలన్స్ ఉన్న షూటింగ్ ని పూర్తి చేసింది. కందిరీగ, రభస ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో నభ నటేష్ హీరొయిన్.
సోను సూద్ ఇందులో ఓ కీలక పాత్ర చేయడంతో హైప్ కు చాలా ప్లస్ అవుతోంది. క్యాస్టింగ్ కూడా భారీగానే సెట్ చేసుకున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మరో ఆకర్షణగా నిలుస్తోంది. దసరా పండక్కు అందరూ అప్ డేట్స్ ఇచ్చారు కానీ ఈ టీమ్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. రాక్షసుడు సూపర్ హిట్ తర్వాత సాయి శ్రీనివాస్ చేసిన సినిమా ఇదే. అప్పుడెప్పుడో సంక్రాంతి రిలీజ్ అన్నారు ఇప్పుడా అవకాశాలు తగ్గిపోతున్నాయి. విపరీతమైన పోటీ నెలకొంది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రావడం కన్ఫర్మ్ కాలేదు కానీ అరణ్య, రెడ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, క్రాక్ వగైరా ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నాయి.
ఇక మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి కూడా మౌనంగా ఉంది. వైరస్ టైంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని మొదట షూట్ కు వెళ్ళింది ఇదే. కన్నడ భామ రచిత రామ్ హీరోయిన్. పులి వాసు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కొన్ని రిపేర్లు జరుగుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అవి కొలిక్కి వచ్చాక అప్పుడు డిసైడ్ చేస్తారట. ఒకవేళ ఓటిటి అనుకున్నా దానికి సంబంధించిన లీక్స్ కూడా బయటికి రావడం లేదు. డెబ్యూ మూవీ విజేత డిజాస్టర్ కావడంతో కళ్యాణ్ దేవ్ కు ఇంకా మార్కెట్ ఏర్పడలేదు. మెగా ఫ్యామిలీ బ్రాండ్ తోనే అవకాశాలు వస్తున్నాయి. అశ్వద్ధామ దర్శకుడు రమణ్ తేజ్ తో రామ్ తాళ్ళూరి నిర్మాతగా ఓ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది


Click Here and join us to get our latest updates through WhatsApp