అనుష్క రాక గురించి సస్పెన్స్

By iDream Post Sep. 27, 2020, 02:08 pm IST
అనుష్క రాక గురించి సస్పెన్స్

ఇంకో నాలుగు రోజుల్లో నిశ్శబ్దం విడుదల ఉన్నప్పటికీ టైటిల్ కు తగ్గట్టే యాక్టర్స్ తో సహా యూనిట్ మొత్తం సైలెంట్ గా ఉంది. ప్రమోషన్లు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. మాధవన్ ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడం తప్ప సోషల్ మీడియాలోనూ ఏమంత హడావిడి చేయడం లేదు. అయితే తాజాగా బిగ్ బాస్ 4 హౌస్ కి అనుష్కను అతిథిగా తీసుకొచ్చే ఆలోచన గట్టిగానే జరుగుతోందట. తనకు మొదటి అవకాశం ఇచ్చి కెరీర్ కు బంగారు బాట వేసిన నాగార్జున అంటే స్వీటీకి చాలా అభిమానం గౌరవం. అందుకే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు కూడా సోగ్గాడే చిన్ని నాయనాలో చిన్న క్యామియో అడిగినా నో అనకుండా చేసింది.

సో ఇప్పుడు ఈ షో కోసం రిక్వెస్ట్ చేస్తే కాదనదు. అందులోనూ తన కొత్త సినిమా పబ్లిసిటీకి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అనుష్కను నిన్న లేదా ఈ రోజు ఎంట్రీ చేయించేలా ముందు డిజైన్ చేశారట. కానీ కరోనా నేపథ్యంలో నేరుగా అలా అనుకున్న వెంటనే అమలు పరచడం సాధ్యం కాదు. టెస్ట్ చేయించి తగినంత క్వారెంటైన్ లో ఉన్నారని ధృవీకరించుకుని ఆపై పిలవాల్సి ఉంటుంది. ఒకవేళ పార్టిసిపెంట్స్ మధ్యకు పంపకపోయినా కనీసం నాగార్జున తో పాటు కాసేపు కో యాంకరింగ్ చేయించే ఛాన్స్ అయితే ఉంది. మరి నెక్స్ట్ వీక్ తీసుకొస్తారా లేదా అనేది వేచి చూడాలి. అదే నిజమైతే అప్పటికంతా నిశ్శబ్దం విడుదలై ఉంటుంది. పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే ప్రమోషన్ కు హెల్ప్ అవుతుంది. కాలేదంటే పెద్దగా ఉపయోగం ఉండదు.

గత మూడు సీజన్లలో క్రమం తప్పకుండా సెలెబ్రిటీలను తీసుకొచ్చిన బిగ్ బాస్ కోవిడ్ నిబంధనల వల్ల ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. అందులోనూ థియేట్రికల్ రిలీజులు లేకపోవడంతో ఇలా టీవీ స్టూడియోలకు రావడానికి యాక్టర్స్ అంతగా ఇష్టపడటం లేదు. పరిస్థితి సద్దుమణగడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. బిగ్ బాస్ చేతిలో మిగిలి ఉన్నది ఇంకో రెండున్నర నెలల టైం. ఆ లోగా అంతా నార్మల్ కావడం జరగని పనే. పైగా వైరస్ తగ్గుముఖం పట్టాక ఆరు నెలల గ్యాప్ తీసుకున్న ఆర్టిస్టులు షూటింగులతో చాలా బిజీ అవుతున్నారు.స్పాట్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లడం తప్ప ఇంకే పనికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అనుష్క వస్తే బిగ్ బాస్ సభ్యులకు మంచి కిక్ వస్తుంది కానీ ఒక్క రోజు షూటింగుకైనా తను రెడీ అంటుందో లేదో వేచి చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp