టాలీవుడ్ టార్గెట్ గా గజినీ ప్లాన్స్

By iDream Post Jun. 19, 2021, 03:30 pm IST
టాలీవుడ్ టార్గెట్ గా గజినీ ప్లాన్స్


ఈ మధ్య టాలీవుడ్ దర్శకులు తమిళ హీరోలతో జట్టు కట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో వీటిని ప్రకటిస్తుండటంతో ఇక్కడి స్టార్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే తెలుగు స్ట్రెయిట్ మూవీతో ఎంట్రీ ఇవ్వాలని ధనుష్, విజయ్ డిసైడ్ కాగా తాజాగా ఈ లిస్టులోకి సూర్య కూడా చేరబోతున్నాడు. అయితే ఈ విషయంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి బోయపాటి శీను. రెండు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ఇద్దరిలో ఒకరితో చేసేందుకు సూర్య గట్టిగా ఫిక్స్ అయ్యాడని కాకపోతే ఎవరు ఫైనల్ అవుతారో తెలియదని సన్నిహిత వర్గాల సమాచారం. రావడమైతే ఫిక్స్ అని నమ్మకంగా చెబుతున్నారు,

అఖండతో బిజీగా ఉన్న బోయపాటి శీను ఆ తర్వాత ఫ్రీ అయిపోతాడు. అల్లు అర్జున్ తో గీత ఆర్ట్స్ ఓ సినిమా ప్లాన్ చేసిందనే టాక్ ఉంది కానీ అదెంతవరకు నిజమవుతుందో చెప్పలేం. బన్నీ ప్రస్తుతం పుష్పనే ప్రపంచంగా ఉన్నాడు. దీని ప్రమోషన్ కోసం ఏకంగా ముంబై నుంచి ఒక పిఆర్ టీమ్ ని ప్రత్యేకంగా పిలిపించుకున్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అఖండ ఫలితం కూడా ఇక్కడ కీలకం కాబోతోంది. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ సర్కారు వారి పాట తరువాత మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. సో ఇంకో ఏడాది దాకా త్రివిక్రమ్ దొరికే ఛాన్స్ లేనట్టే.

అటు చూస్తే సూర్య కూడా ఖాళీగా లేడు. ఓ ఆరేడు నెలల తర్వాత కానీ కొత్త సినిమా మొదలుపెట్టే పరిస్థితి లేదు. ఈ క్యాలికులేషన్స్ అన్నీ చూస్తుంటే ప్రకటనలు వచ్చే దాకా ఏదీ నమ్మలేని పరిస్థితి. ఒకవేళ ముందే ఓ మాట అనేసుకున్నా తర్వాత వద్దనుకున్నవి చాలా ఉన్నాయి. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్, అల్లు అర్జున్ - కొరటాల శివ కాంబోలు అఫీషియల్ గా బయటికి వచ్చాక క్యాన్సిల్ అయ్యాయి. మరి ప్రస్తుతానికి అంత కూడా గ్యారెంటీ లేని ఇలాంటి వార్తలు నిజమవుతాయని చెప్పలేం కానీ సూర్య మనసులో మాత్రం తెలుగులో సాలిడ్ గా హిట్టు కొట్టాలనైతే ఉంది. కార్తీ ఆల్రెడీ ఊపిరిలో చేశారు కాబట్టి ఇక బ్యాలన్స్ ఉన్నది అన్నయ్యనే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp