సమ్మర్ సినిమా 2021 చాలా వేడి గురు

By iDream Post Nov. 22, 2020, 06:10 pm IST
సమ్మర్ సినిమా 2021 చాలా వేడి గురు

ఈ సంవత్సరం మొత్తం కరోనా పుణ్యమాని కర్పూరమయ్యింది కానీ ఇక అందరి ఆశలు వచ్చే 2021 మీదే నిలుస్తున్నాయి. డిసెంబర్ లో థియేటర్లు తెరవబోతున్నా మహా అయితే ఒకటి లేదా రెండు తెలుగు సినిమాలు తప్ప కొత్తవేవి హాళ్లలో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సంక్రాంతి రేస్ లో ఇప్పటికే నాలుగైదు చిత్రాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అప్పటికంతా వంద శాతం సీట్లకు అనుమతులు వస్తాయనే ధీమాతో ఎవరికి వారు గట్టి ప్లానింగ్ లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే సమ్మర్ మాత్రం చాలా అంటే చాలా చాలా హాట్ గా ఉండబోతోంది. మూవీ లవర్స్ పర్సులో గట్టి బరువులే పెట్టుకోవాల్సి వస్తుంది.

ఇప్పటిదాకా ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, యష్ కేజీఎఫ్ చాప్టర్ 2, చిరంజీవి ఆచార్య, ప్రభాస్ రాధే శ్యామ్, రజినీకాంత్ అన్నాతే లు ఆ టైంకంతా షూటింగ్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కోసం రెడీ అవుతున్నాయి. ఏదైనా షూట్ ఆలస్యమైతే తప్ప దాదాపు పోస్ట్ పోన్లు ఉండవు. ఆర్ఆర్ఆర్ వచ్చే ఛాన్స్ లేదని ఇన్ సైడ్ టాక్. రాజమౌళి దసరా లేదా దీపావళి ఆ రెండూ కుదరకపోతే 2022 జనవరికి వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నట్టు వినికిడి. సో దీని గురించిన టెన్షన్ అక్కర్లేదు. అల్లు అర్జున్ పుష్ప కూడా అదే సీజన్ ని టార్గెట్ చేసింది కానీ సుకుమార్ దర్శకత్వం కాబట్టి అంత ఈజీగా జరగకపోవచ్చు.

ఈ లెక్కన చూస్తే వచ్చే వేసవిలో బరిలో దిగే సినిమాల మీద ఎంతలేదన్నా వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలాగూ అప్పటిదాకా కరోనా వ్యాక్సిన్ రాకుండా పోదు. వైరస్ తీవ్రత దాదాపు జీరోకు వెళ్ళిపోయి ఉండొచ్చు. జనం ఎప్పటిమాదిరి థియేటర్లకు వచ్చి హౌస్ ఫుల్స్ చేయిస్తారు. అందుకే భారీ బడ్జెట్ సినిమాలు సంక్రాంతికి బదులు సమ్మర్ వైపే చూస్తున్నాయి. విజయ్ మాస్టర్ అంత లేట్ చేయకపోవచ్చు. ఇవి కాకుండా ఇంకెన్ని ఆలోగా రెడీ అవుతాయో చెప్పలేం. అందుకే దర్శక నిర్మాతలు పక్కా ప్లానింగ్ తో డెడ్ లైన్ మీట్ అయ్యేలా షూటింగులు ప్లాన్ చేసుకుంటున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp