మే నెలలో స్టార్ సినిమాల పండగ

By iDream Post Mar. 10, 2020, 11:21 am IST
మే నెలలో  స్టార్ సినిమాల పండగ

ఫిబ్రవరిలో వచ్చిన భీష్మను మినహాయించి ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ సినిమా ఏదీ బాక్స్ ఆఫీస్ వద్దకు రాలేదు. పలాస 1978కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ అది కలెక్షన్స్ లోకి మారడం లేదు. వచ్చే వారం అంటే 13న కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలైతే ఉన్నాయి కాని వాటి మీద బజ్ సున్నానే. మార్చ్ 25న నాని వి విడుదలయ్యేదాకా ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఆ తర్వాత మళ్ళి గ్యాప్ రాబోతోంది. ఒకపక్క పరీక్షల సీజన్ తో పాటు ఎండల దెబ్బకు నిర్మాతలు డేట్లు అనౌన్స్ చేసే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

కాని రాబోయే మే మాత్రం మళ్ళి స్టార్ సినిమాలతో పండగా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మే 1సాయి ధరం తేజ్ 'సోలో బ్రతుకే సో బెటరూ' ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. అదే రోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ టాక్, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు.
ఆ మరుసటి వారమే 8న రవితేజ 'క్రాక్' బరిలో దిగుతుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. శృతి హాసన్ కం బ్యాక్ ఇవ్వడం., క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రవితేజ ఊర మాస్ పోలీస్ గా కనిపించడం హైలైట్స్ గా కనిపిస్తున్నాయి.

ఇక మే 15 పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్ 'కు గ్రౌండ్ రెడీ అవుతోంది. వాయిదా పడొచ్చన్న ప్రచారం మొదలయ్యింది కానీ దిల్ రాజు మాత్రం అదే తేదీకి రిలీజ్ కావాలనే ప్లాన్ తో షూటింగ్ వేగంగా కానిస్తున్నారు. ఇక 22న అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వచ్చే ఛాన్స్ ఉంది. అధికారికంగా ప్రకటించకపోయినా ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే చెప్పొచ్చు. ఇక 29న గోపిచంద్ -సంపత్ నంది కాంబోలో రూపొందిన 'సిటీమార్' తో పాటు ఆకాష్ పూరి 'రొమాంటిక్' కూడా రంగంలోకి దిగుతున్నాయి. సో మే నెల మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయి సినిమా ప్రియుల పర్సులకు పెద్ద పరీక్ష పెట్టేలా కనిపిస్తోంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp