జూనియర్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తారా

By iDream Post Apr. 25, 2020, 11:20 am IST
జూనియర్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తారా

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు కరోనా వల్ల వచ్చిన బ్రేక్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ వైరస్ ప్రభావం లేకపోయి ఉంటె ఇంకో రెండు నెలల్లో ఇదీ సెట్స్ పైకి వెళ్లేదే. కాని ఇప్పుడా ఛాన్స్ లేదు. వాయిదా తప్పదు. ఈలోగా స్క్రిప్ట్ ని ఫైనల్ చేయడంతో పాటు టీంని సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్. ఇందులో హీరొయిన్ గా శృతి హసన్ పేరు పరిశీలనలో ఉన్నట్టుగా వచ్చిన తారక్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది.

కారణం లేకపోలేదు. ఇప్పుడు అమ్మడు ఫాంలో లేదు. తాజాగా తెలుగులో ఒప్పుకుని చేసిన సినిమా రవితేజ క్రాక్ ఒక్కటే. అంతకు ముందు పవన్ కళ్యాణ్ తో చేసిన కాటమరాయుడే ఆఖరిది. ఇప్పుడు శృతి హాసన్ లో మునుపటి గ్లో లేదనేది సాధారణ ప్రేక్షకుల అభిప్రాయం. కాటమరాయుడులోనే తన లుక్స్ తేడా అనిపించాయి. మరి అలాంటప్పుడు ఇంకే ఆప్షన్ లేదన్నట్టుగా తనను ఎందుకు తీసుకోవడం అనేదే ఇక్కడ వినిపిస్తున్న కామెంట్. ఇదంతా అధికారికంగా ధృవీకరించింది కాదు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేం కాని ఇప్పుడీ టాక్ ఏకంగా ప్రింట్ మీడియాలో సైతం రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

జూనియర్ ఎన్టీఆర్, శృతి హాసన్ కలిసి ఒకే సినిమాలో నటించారు. అది రామయ్య వస్తావయ్య. అందులోనూ శృతి హాసన్ ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే ఉంటుంది. మెయిన్ హీరొయిన్ సమంతా. ఫలితం డిజాస్టర్ అయ్యింది. ఈ కోణంలోనూ ఫ్యాన్స్ సెంటిమెంట్ గా భావించే అవకాశాలు లేకపోలేదు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇప్పటికే టైటిల్ గా అయినను పోయి రావలె హస్తినకు అని ప్రచారంలో ఉంది. యూనిట్ అయితే ఖండించింది కాదు గతంలోనూ ఇలా లీకైన టైటిల్సే త్రివిక్రమ్ సినిమాలకు ఫిక్స్ కావడం గతంలో చాలా సార్లు జరిగింది. తమన్ దీనికి సంగీతం అందించబోతున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దీన్ని తీర్చిదిద్దబోతున్నట్టు వినికిడి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp