రాజమౌళి కీరవాణిల మ్యూజిక్ స్కెచ్

By iDream Post Jul. 27, 2021, 12:15 pm IST
రాజమౌళి కీరవాణిల మ్యూజిక్ స్కెచ్

టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే మోస్ట్ వెయిటెడ్ మల్టీ స్టారర్ గా భారీ అంచనాలు మోస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్ మొదలైపోయింది. మార్కెటింగ్ లో నిష్ణాతుడైన రాజమౌళి ఇకపై వేయబోయే ప్రతి అడుగును గ్రాండ్ స్కేల్ మీద పబ్లిసిటీ చేయబోతున్నాడు. దానికి నిదర్శనంగా ఫస్ట్ ఆడియో సింగల్ ని చెప్పుకోవచ్చు. ఆగస్ట్ 1న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ లోని దోస్తీ అనే మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. దీన్ని ప్రత్యేకంగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాజమౌళి గత సినిమాల్లో నటించిన హీరోల పైన షూట్ చేశారని టాక్ వచ్చింది కానీ చూసేదాకా దీనికి క్లారిటీ రాదు.

ఇప్పుడీ పాట కోసం కీరవాణి ప్రత్యేకంగా అయిదుగురు గాయకులను సిద్ధం చేసుకుని ఒక్కో వెర్షన్ ఒక్కో సింగర్ తో పాడించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో హేమచంద్ర, తమిళంలో అనిరుద్ రవిచందర్, హిందీలో అమిత్ త్రివేది, కన్నడలో యాసిన్ నజీర్, మలయాళంలో విజయ్ ఏసుదాస్ దీన్ని ఆలపించారు. వీళ్ళతో కలిస్ ఉన్న ఫోటోతో కూడిన పోస్టర్ ని యూనిట్ ప్రత్యేకంగా రిలీజ్ చేసి అంచనాలు ఎక్కడికో తీసుకెళ్లింది. ఇప్పుడీ సాంగ్ కోసం చరణ్ తారక్ ఫ్యాన్స్ మాములుగా ఎదురు చూడటం లేదు. ఈ ఇద్దరు కలిసి కనిపించబోయే ఫుటేజ్ కూడా ఇందులోనే ఉండబోతోందని సమాచారం.

రాజుగారి ఏనుగు వీధుల్లో నడిచినా సంబరమే అన్నట్టు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తాలూకు ఏ అప్ డేట్ అయినా సెన్సేషన్ గా మారుతోంది. అక్టోబర్ 13 విడుదలకే కట్టుబడిన జక్కన్న బృందం ఆ మాట మీద ఉంటారా లేదా అనేది అప్పటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే డిస్ట్రిబ్యూటర్లకు ఆ మేరకు కన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది. ఇంకో రెండున్నర నెలలు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్ ని కనివిని ఎరుగని స్థాయిలో చేయబోతున్నారు. కరోనా పూర్తిగా మాయమైపోయి అంతా సద్దుమణిగి పోతే బాహుబలి తర్వాత అంతకు మించిన ఓపెనింగ్స్ ని బాక్సాఫీస్ వద్ద అక్టోబర్ లో చూడొచ్చు

Also Read: స్మార్ట్ స్క్రీన్ పై రాబోతున్న మూవీస్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp