ఆ ఒక్క సంఘటన బాధ పెట్టింది

By iDream Post Jul. 02, 2020, 06:41 pm IST
ఆ ఒక్క సంఘటన బాధ పెట్టింది

శ్రీనివాసరెడ్డి కేవలం కమెడియన్ గానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా అన్ని రకాలుగానూ ప్రూవ్ చేసుకున్న టాలెంటెడ్ యాక్టర్ . ఇష్టం సినిమాతో పరిచయమైనా పేరు వచ్చింది మాత్రం పూరి ఇడియట్ వల్లే. రవితేజ పక్కన చాలా ఈజ్ తో శ్రీనివాసరెడ్డి ఇచ్చిన టైమింగ్ కి హాల్ లో నవ్వులు పూశాయి. ఇక అక్కడి నుంచి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరసగా మంచి అవకాశాలు దక్కించుకున్న ఈయన డీ, దుబాయ్ శీను, దేశముదురు, పరుగు లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో తన రోల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించారు.

హీరోగానూ గీతాంజలితో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత జయమ్ము నిశ్చయమ్మురా, జంబలకిడిపంబ లాంటి వాటి ద్వారా ఇంకొన్ని చేశారు కాని తనకు పేరు తెచ్చిన హాస్య పాత్రలంటేనే బాగా ఇష్టపడతారు. ఈ సంగతలా ఉంచితే ఒక్కోసారి మనం తెలియకుండా చేసే పొరపాట్లు ఊహించని పరిణామాలకు దారి తీస్తాయి. శ్రీనివాసరెడ్డికు అలాంటిది ఓసారి అనుభవమయ్యింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్, సమంతా జంటగా రూపొందిన అఆ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. దాని సక్సెస్ మీట్ లో స్టేజి మీద మాట్లాడుతూ అందులో క్లైమాక్స్ లో రావు రమేష్ చెప్పే బాలు పిసుక్కోవడం డైలాగ్ ని శ్రీనివాసరెడ్డి వేరే ఉద్దేశంతో అనేశారు. దాంతో ఇది కాస్తా అక్కడున్న వాళ్లకు వేరే అర్థంతో వెళ్లిపోయింది.

అప్పటికి జరిగిందేమిటో ఆయనకు అర్థం కాలేదు. కావాలనే త్రివిక్రమ్ అలా మాట్లాడించారని కామెంట్స్ మొదలయ్యాయి. మీడియాలో సైతం ఇలా పబ్లిక్ గా డబుల్ మీనింగ్ లో అనడం గురించి విమర్శలు వచ్చాయి. తాను చేసిన పొరపాటు కం తప్పేమిటో ఆయనకు అర్థమైపోయింది. అప్పటికే కొంత డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పటికీ దాని గురించి బాధ పడతారు శ్రీనివాసరెడ్డి. ఉద్దేశం ఏదైనా సందర్భం, పలికిన విధానం వేరే అర్థాన్ని ఇచ్చింది కాబట్టి సమర్ధించుకునే సమస్యే లేదని నిజాయితీగా ఒప్పేసుకున్నారు. మొత్తానికి ఈ సంఘటన శీనుకే కాదు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పాఠాన్ని నేర్పించేదే. నలుగురిలో ఉన్నప్పుడు మాట విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఉదాహరణగా నిలిచేది .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp