తండ్రి కొడుకుల సీమ సెంటిమెంట్

By iDream Post Jul. 28, 2021, 12:30 pm IST
తండ్రి కొడుకుల సీమ సెంటిమెంట్

థియేటర్లు తెరుచుబోతున్న తరుణంలో మెల్లగా చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. అంతో ఇంతో కాస్త చెప్పుకోదగ్గ అంచనాలు ఉన్నవాటిలో ఎస్ఆర్ కల్యాణమండపం ఒకటి. శ్రీధర్ గాదె దర్శకత్వంలో రాజావారు రాణిగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా, టాక్సీ వాలాతో మెప్పించిన ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా రూపొందిన ఈ లవ్ ఎంటర్ టైనర్ వచ్చే నెల 6న విడుదల కాబోతోంది. లాక్ డౌన్ టైంలో మంచి ఆఫర్లతో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ మూవీ ఇప్పటికే మ్యూజికల్ గా మంచి పేరు తెచ్చుకుంది. చుక్కల చున్నీ పాట యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇవాళ ఏఎంబి సినిమాస్ లో ట్రైలర్ ని లాంచ్ చేశారు.

Also Read: ఆలోచింపజేసిన న్యాచురల్ స్టార్

అది రాయలసీమలో ఒక ఊరు. ఆస్తులన్నీ కరిగింది ఖాళీగా ఉన్న తండ్రి(సాయి కుమార్)కి కాలేజీలో చదువుకునే అతని కొడుక్కి(కిరణ్ అబ్బవరం)కు మధ్య మాటలు ఉండవు. కళాశాలలో బాబుకి ఒక ప్రేమకథ కూడా ఉంటుంది. నచ్చిన అమ్మాయి(ప్రియాంక జవల్కర్)ని మెప్పించడంలో ఫైనల్ గా సక్సెస్ అవుతాడు. జీవితంలో సెటిలవ్వాలని చూస్తున్న తరుణంలో వీళ్ళ జీవితంలోకి ఒక ఫ్యాక్షనిస్టు(శ్రీకాంత్ అయ్యంగార్)ప్రవేశిస్తాడు. తండ్రిని చంపడానికి గూండాలు వెంటపడతారు. అప్పుడు ఈ కుర్రాడు వాళ్ళను ఎలా ఎదురుకున్నాడు అసలు ఇతనికి ఎస్ఆర్ కళ్యాణ మండపానికి కనెక్షన్ ఏంటో సినిమాలో చూడాలి

ట్రైలర్ ని బాగానే కట్ చేశారు.గతంలో విడుదల చేసిన టీజర్ తో పోలిక రాకుండా ఇంకో వెర్షన్ లో చూపించారు. లుక్స్ లోనూ నటనలోనూ కిరణ్ మెచ్యూరిటీ కనిపిస్తోంది. కథ స్క్రీన్ ప్లే సంభాషణలు తనే సమకూర్చుకోవడం విశేషం. డైలాగుల్లో సీమ యాస తాలూకు స్పార్క్ ఉంది. యూత్ క్లాస్ మాస్ అన్ని వర్గాలను టార్గెట్ చేసేలా శ్రీధర్ గాదె టేకింగ్ కూడా అంచనాలకు దోహదపడింది. చేతన్ భరద్వాజ్ సంగీతం మరో ప్లస్ పాయింట్. మొత్తానికి మూడు నెలల గ్యాప్ తర్వాత ఎంటర్ టైనర్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులను కనక ఎస్ఆర్ కళ్యాణ మండటం మెప్పించగలిగితే హిట్టు కొట్టినట్టే

Also Read: భీమ్లా నాయక్ ఆన్ డ్యూటీ!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp