విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం : అఫీషియల్

By iDream Post Sep. 24, 2020, 07:43 pm IST
విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం : అఫీషియల్

అంతా కుదుటపడుతోంది, ఇంకొద్ది రోజుల్లో గానగంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మునుపటి లాగే బయటికి వస్తారని ఎదురు చూస్తున్న సంగీత ప్రియులకు ఆందోళన కలిగించే ప్రెస్ నోట్ ని ఆయనకు చికిత్స అందిస్తున్న ఎంజిఎం హాస్పిటల్ విడుదల చేసింది. ఆగస్ట్ 5న చేరిన బాలుకు ఎక్మోన మరియు ఇతర లైఫ్ సపోర్ట్ మెజర్స్ అన్నీ అందిస్తున్నామని అయితే గత 24 గంటల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని అందులో పేర్కొంది. నిజానికి ఓ పది రోజుల క్రితం ఆయన అబ్బాయి చరణ్ వీడియోలు విడుదల చేసి నాన్న త్వరగా కోలుకుంటున్నారని చెప్పినప్పుడు సర్వత్రా ఆనందం వ్యక్తమయ్యింది.

కాని ఈలోగా ఇలా మళ్ళీ తిరగబడుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. గత రెండు మూడు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, పరిశ్రమ ప్రముఖులు లెక్కలేనన్ని ప్రార్ధనలు చేశారు చేస్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగానే మంచి ఫలితం వచ్చినట్టు కూడా కనిపించింది. అయితే ఇప్పుడు ఎంజిఎం ప్రకటనతో మళ్ళీ అందరం బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం కోసం మరోసారి ప్రార్దించాల్సిన అవసరం వచ్చింది. వేల వేల పాటలతో భారతీయ చరిత్రలో గాయకుడిగా తనకంటూ కొన్ని పేజీలను బంగారు సిరాతో రాసుకున్న బాలు ఇందరి అభిమానం అండగా ఉండగా ఏమి కాదనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. అదే ఫలించి క్షేమంగా ఇంటికి రావాలనే అందరి ఆకాంక్ష

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp