కొడుకు మిత్రుడు - తండ్రి శత్రువు

By iDream Post Jul. 01, 2020, 06:36 pm IST
కొడుకు మిత్రుడు - తండ్రి శత్రువు

అపరిచితుడుతో తెలుగులోనూ అశేష అభిమానులను సంపాదించుకున్న చియాన్ విక్రమ్ తన 60వ సినిమాలో కొడుకు ధృవ్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మతో డెబ్యు ఇచ్చిన ధృవ్ రెండో మూవీలోనే నాన్నతో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టాన్ని పొందాడు. పేట ఫేం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లాక్ డౌన్ పూర్తిగా సమిసిపోయక రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్నారు. ఇది మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుందని సమాచారం. అయితే ఇందులో ఒక కీలకమైన ట్విస్ట్ గురించి చెన్నై సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

దాని ప్రకారం ఇందులో విక్రమ్ పాత్ర నెగటివ్ షేడ్స్ లో ఉంటుంది. ధృవ్ పాజిటివ్ యాంగిల్ లో ఉంటూ తండ్రితో సై అంటే సై అనే రీతిలో టెర్రిఫిక్ సీన్స్ ఉంటాయట. వాటిని చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. విక్రమ్ వారసుడిగా తెరంగేట్రం కన్నా ముందే ధృవ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఒరిజినల్ వెర్షన్ అంత గొప్ప విజయం సాధించకపోయినా ఆదిత్య వర్మ మరీ తీవ్రంగా అయితే నిరాశపరచలేదు. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఆడేసిన సినిమా రీమేక్ కాబట్టి డబ్బింగ్ చేసే ఆలోచన మానుకున్నారు. ఇప్పుడీ మూవీలో విక్రం ధృవ్ విభిన్న పాత్రలు చేయడం విశేషమే. కార్తీక్ సుబ్బరాజ్ కొత్త చిత్రం ధనుష్ జగమే తంతిరం రిలీజ్ కు రెడీ గా ఉంది. తెలుగులో కూడా అనువదించి ఫస్ట్ లుక్ పోస్టర్ రెండు నెలల క్రితమే వదిలారు.

కాని లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడి ఆగిపోయింది. ఓటిటి కోసం కార్తీక్ సుబ్బరాజ్ ప్రయత్నిస్తున్నప్పటికి ధనుష్ వారిస్తున్నట్టు తెలిసింది. స్టార్ హీరోలు సినిమాలేవీ ఇప్పటిదాకా డైరెక్ట్ డిజిటల్ లో రాలేదు కాబట్టి తాను ఆ రిస్క్ తీసుకోలేనని స్పష్టం చేశాడట. దీంతో ఇది ఆ రూపంలో వచ్చే ఛాన్స్ లేనట్టే. ఇక విక్రం-ధృవ్ ల కాంబో ప్రాజెక్ట్ కాబట్టి పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేశారట. బడ్జెట్ కూడా సుమారు వంద కోట్లకు పైగానే ఉండొచ్చని ప్రాధమిక అంచనా. అయితే లాక్ డౌన్ తర్వాత చాలా సమీకరణాల్లో మార్పులు వచ్చాయి కనక ఖర్చు విషయంలో కోతలు, రాజీలు తప్పకపోవచ్చు. ధృవ్ కు తెలుగు డెబ్యు ఈ సినిమానే అవుతుంది. దీనికి సంగీతం అనిరుద్ రవిచందర్. విక్రం రిలీజ్ కావలసిన మరియు సెట్ మీదున్న సినిమాలు కోబ్రా, ధ్రువ నక్షత్రం, మహావీర్ కర్ణన్, పోన్నియన్ సెల్వన్. ఇవన్ని మనకూ రాబోతున్నాయి. కాకపోతే ఏది ముందు ఏది ఆఖరు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp