ఉయ్యాల మీద ఊగిసలాట - మెడల్ కోసం ఇద్దరి వేట

By iDream Post Dec. 04, 2020, 10:42 am IST
ఉయ్యాల మీద ఊగిసలాట - మెడల్ కోసం ఇద్దరి వేట

రోజులు దగ్గర పడుతున్న కొద్దీ బిగ్ బాస్ ఫైనల్ కోసం సభ్యుల మధ్య ఫిట్టింగ్ పెట్టే కార్యక్రమం జోరుగా సాగుతోంది. లెవల్ ప్రకారం పెడుతున్న టాస్కుల్లో భాగంగా మెల్లగా ఒక్కొక్కరిని తప్పిస్తున్న ఎత్తుగడ ఫలితాన్ని ఇస్తోంది. ఎలిమినేషన్ తర్వాత రేస్ టు ఫినాలేలో ఏడుగురు మిగలగా అందులో కొందరు బయటికి వచ్చాక సోహైల్, అఖిల్ లు ఈ ఇద్దరూ టికెట్ టు ఫినాలే మెడల్ కాంపిటీషన్ కు అర్హత సాధించారు. ఇందులో భాగంగా కొత్తగా ఉయ్యాల టాస్కుని ఇచ్చారు. ఇద్దరూ దాని మీద కూర్చోవాలని ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వారికి మెడల్ వస్తుందని చెప్పాడు బిగ్ బాస్. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది.

ఏ పని చెప్పినా కూడా ఈ ఇద్దరూ ఆ ఉయ్యాల మీదే చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకు దిగకూడదు. దీనికి జడ్జ్ గా అభిజిత్ అప్పాయింట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి మొదలయ్యింది అసలు రోత ప్లస్ రచ్చ. మంచి ఎండలో జాకెట్లు వేయించడం, ప్రకృతి ధర్మం వస్తోందని అడిగితే పసుపు పాలు తాగించి ఆ బృహత్తర కార్యక్రమాన్ని కూడా బెడ్ షీట్స్ మాటున కవర్లలోనే కానివ్వడం ఎలాంటి క్రియేటివిటినో చెప్పడం కష్టం. మధ్యలో మోనాల్ మొన్న హగ్ ఇచ్చిన అవినాష్ ను అన్న అంటూ పిలిచి ఆటపట్టించింది. అభిజిత్ తో తనకున్న సోఫా జ్ఞాపకాలను కాసేపు హారికతో చెప్పుకుని టైం పాస్ చేసింది

ఇక తాగడానికి కష్టమనిపించే మూలికల జ్యూస్ ని అఖిల్ సోహైల్ లు ఒకరికొకరు తాగించుకుని ఆ తర్వాత నేనంటే నేను గొప్పనే వాదనలకు దిగారు. ఇందులో పరస్పరం ఫ్లాష్ బ్యాకులు చెప్పుకున్నారు.ఇందులో హారిక, అభిజిత్, మోనాల్ అందరూ భాగమవ్వాల్సి వచ్చింది. ఇక ఉయ్యాల నుంచి కిందకు దిగకుండా సోహైల్ అఖిల్ లు పడ్డ తిప్పలు అన్ని ఇన్ని కావు. హౌస్ మేట్స్ కూడా ఇది జరిగినంత సేపు మేల్కొనే ఉండాలని, లైట్స్ కూడా ఆఫ్ చేయమని చెప్పాడు బిగ్ బాస్. దీంతో అరియనా కూడా వినోదంలో పాలు పంచుకుంది. మొత్తానికి ఈ వారం ఎండింగ్ కు వచ్చిన బిగ్ బాస్ ఈ రోజు ఆ ఇద్దరినీ ఏం చేయబోతున్నాడో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp